ఐపీఎల్ ఎఫెక్ట్, స్టార్ హీరోయిన్ కు సైబర్ క్రైమ్ సమన్లు, మేడమ్ ఏం చేశారంటే ?, అందుకేనా ఇంత !

దేశం మొత్తం లోక్ సభ ఎన్నికల ప్రచారం, మరో వైపు ఐపీఎల్ హవా నడుస్తోంది. ఇదే సమయంలో విద్యార్థులు పరీక్షల బీజీలో ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంతో నాయకులు ఊరుఊరు తిరుగుతున్నారు. సాయంత్రం అయితే క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోయి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి స్టార్ హీరోయిన్ కు పోలీసులు సమన్లు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఐపీఎల్‌ మ్యాచ్ లను అక్రమంగా ప్రసారం చేశారన్న ఆరోపణలపై ఏప్రిల్ 29వ తేదీన విచారణకు హాజరు కావాలని ముంబాయి సైబర్ క్రైమ్ పోలీసులు బహుబాష నటి తమన్నా భాటియా అలియాస్ తమన్నాకు సమన్లు ​​జారీ చేశారు. ఐపీఎల్‌లో ఏ సీజన్ మరియు ఏమి జరిగిందని సినీ అభిమానుతో పాటు క్రికెట్ ప్రేమికులు చాలా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఐపీఎల్ కు సంబంధించి మిల్క్ బ్యూటీకి ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైనాయి.

The Mumbai Cyber Crime Police has issued a summons to the film s heroine Tamannaah Bhatia

ఫెయిర్‌ప్లే యాప్‌లో 2023 ఐపీఎల్ మ్యాచ్ లను అక్రమంగా ప్రసారం చేసినందుకు నటి తమన్నా భాటియాకు ముంబాయి పోలీసులు సమన్లు ​​జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు ప్రసారం చేసే ఓటీటీ హక్కులు జియో సినిమాస్ వద్ద మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో ఐపీఎల్ ప్రసార హక్కులను పొందకుండానే Fairplay యాప్‌లో ప్రసారం చేయబడింది. ఇది అధికారికంగా ప్రసార హక్కులను పొందిన Jio సినిమాకి చాలా నష్టం కలిగించిందని ఆ రోపణలు ఉన్నాయి.

ఇదే సమయంలో సదరు సంస్థ అధికారులు నటి తమన్నాను కలిసి జరిగిన సమస్య గురించి వివరించారని తెలిసింది. అయితే నటి తమన్నాతో పాటు అధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయని తెలిసింది. చివరికి ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బహుబాష నటి తమన్నాకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+