Mohan Babu: మనోజ్ పై దాడి చేసింది వినయ్ అనే వ్యక్తా..!
ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీ మీడియా, టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. ఉదయం మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కథనాలు వచ్చాయి. మోహన్ బాబు తనపై దాడి చేసినట్లు మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అటు మోహన్ బాబు కూడా మనోజ్ తనపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సోషల్ మీడియా, మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే దీనిపై మంచు ఫ్యామిలీ స్పందించింది.
ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర దాడులు, ఫిర్యాదులు చేసుకున్నారనే వస్తున్న కథనాలు ఊహాజనితం అని పేర్కొంది. మంచు మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఆధారాలు లేకుండా ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొంది. అయితే మంచు ఫ్యామిలీ ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనోజు భూమ మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఈ గొడవలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మనోజ్ పై వినయ్, అతని అనుచరులు దాడి చేశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు విద్యా సంస్థలో కీలక పదవిలో ఉన్నాడని తెలుస్తోంది. నాన్న ప్రమేయంతోనే వినయ్ తనపై దాడి చేశారని మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించి మనోజ్ పహాడి షరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జల్ పల్లి మోనహన్ బాబు నివాసం నుంచి డయల్ 100 కు ఫిర్యాదు వచ్చనట్లు పహడీ షరీఫ్ పోలీసులు లీకులు ఇస్తున్నారు. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ విషయంపై మోహన్ బాబు కానీ.. మంచు మనోజ్ కానీ అధికారికంగా స్పందించలేదు. నిజంగానే మోహన్ బాబు, మనోజ గొడవ పడ్డారా.. లేక వినయ్ మనోజ్ పై దాడి చేశాడా అనేది పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. అసలు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications