Pushpa 2: ఒక్క సీన్ కోసం రూ.50 కోట్లు.. తగ్గేదే లే..!
స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ వచ్చిన సినిమాలన్నీ భారీ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా పుష్ప అల్లు అర్జున్ కేరీర్ లోనే బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి ఆధారణ లభించింది. 2021లో వచ్చిన ఈ మూనీ అనేక రికార్డులు క్రియేట్ చేసింది. పుష్పకు సిక్వెల్ గా పుష్ప-2 మూవీని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జన్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పుష్ప భారీ విజయం సాధించండంతో పుష్ప-2 కూడా భారీ అంచనాలు మొదలయ్యాయి. పుష్ప-2లో అల్లు అర్జున్ కు జంటగా.. రష్మిక నటిస్తున్నారు. సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. పుష్ప-2ను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. పుష్ప-2 సంబంధించి ఇప్పటికే పోస్టర్స్ విడుదలయ్యాయి. పుష్ప-2 అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడడం లేదని తెలుస్తోంది.

తాజాగా పుష్ప-2 కు సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప-2లో ఓ సీన్ షూటింగ్ చేయడానికి ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 25 నిమిషాల పాటు ఉండే ఈ జాతర సీన్ కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశారట. ఈ సీన్ మూవీకే హైలెట్ గా ఉంటుందట. ఈ సీన్ లో అల్లు అర్జున్ అర్ధనారీశ్వరుడిగా కనిపిస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ 25 సీన్ లో ఓ భారీ ఫైట్ తో పాటు ఓ భక్తి పాట కూడా ఉంటుందట. దీనిపై చిత్ర యూనిట్ ఇంత వరకు స్పందించలేదు. అయినప్పటికీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ అంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుందని చెబుతున్నారు. పుష్ప-2 కోసం వేచి చూస్తున్నామని చెబుతున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య సినిమా వచ్చింది. ఇది భారీ విజయం సాధించింది. ఆ తర్వాత ఈ చిత్రానికి సిక్వెల్ గా ఆర్య-2 వచ్చింది. కానీ ఆర్య అంత హిట్ కాలేదు. ఇప్పుడు పుష్ప-2 పుష్పను దాటేస్తుందా చూడాలి.












Click it and Unblock the Notifications