Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాముడంటే భక్తి లేదా: అంతా పైపై మెరుగులేనా?: ఎన్టీఆర్‌పై ట్రోల్స్

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, ఆలయ ప్రారంభోత్సవం కొనసాగిన విషయం తెలిసిందే. రాములవారికి మోదీ తొలి పూజలు చేశారు. విగ్రహం కళ్లకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించి కాటుకను పూశారు. సాష్టాంగ ప్రణామాలు అర్పించారాయన.

These celebrities including NTR were not attend Ayodhya Ram Mandir inauguration

ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వేలాదిమంది ప్రముఖులు హాజరయ్యారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ హీరోలు, బాలీవుడ్ సెలెబ్రిటీలు, క్రికెటర్లు, సామాజిక కార్యకర్తలు, హిందూ, ధార్మిక సంఘాల ప్రతినిధులు రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని కనులారా వీక్షించారు.

ఏపీ నుంచి.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నటుడు సుమన్.. అయోధ్య రామాలయానికి వెళ్లిన వారిలో ఉన్నారు.

నిజానికి- ఆహ్వాన పత్రికలను అందుకున్న వారితో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లిన వారి సంఖ్య కాస్త తక్కువే. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఆయన అటు వెళ్లలేదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అరుదైన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దేవర షూటింగ్‌లో ఉండటం వల్లే ఎన్టీఆర్.. అయోధ్యకు వెళ్లలేదు.

బాల రామాయణం సినిమాలో బాల రాముడిగా నటించారు జూనియర్. రాముడి క్యారెక్టర్‌తోనే తన సినిమా కేరీర్‌ను ఆరంభించారు. తారక రాముడి పేరును పెట్టుకున్నారు. అయినప్పటికీ.. అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్లకోవడం వల్ల ఆయనపై ట్రోల్స్ పడుతున్నాయి.

These celebrities including NTR were not attend Ayodhya Ram Mandir inauguration

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనూష్క శర్మ, మాజీ కేప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా అయోధ్యకు వెళ్లలేదు ఆహ్వానం అందినప్పటికీ. ప్రస్తుతం అనూష్క శర్మ గర్భంతో ఉండటం వల్ల ప్రయాణం చేయడం సురక్షితం కాదనే ఉద్దేశంతోనే వారిద్దరూ అయోధ్యకు వెళ్లలేదని తెలుస్తోంది.

రోహిత్ శర్మ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఇంగ్లాండ్‌తో ఆరంభం కావాల్సి ఉన్న టెస్ట్ మ్యాచ్ కోసం సన్నాహకాలు చేస్తోన్నారు. టెస్ట్ మ్యాచ్ ఉండటం వల్లే ఆయన అయోధ్యకు వెళ్లలేదు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ కూడా అయోధ్యకు వెళ్లలేదు. ప్రస్తుతం ఆయన జోర్డాన్‌లో ఉన్నారు. టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ బడేమియా ఛోటేమియా షూటింగ్‌లో ఉన్నారు. అందుబాటులో లేరు. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి డుమ్మా కొట్టారు.

హీరో సన్నీడియోల్ సైతం అయోధ్యకు వెళ్లనివారిలో ఉన్నారు. గదర్ 2 సినిమా సెట్సపై ఉన్నారాయన. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం అయోధ్యకు గైర్హాజర్ అయ్యారు. మలైకోట్టై వాలీబన్ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+