నా బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేశారు..నాగార్జున హీరోయిన్ సంచలనం
నటి కస్తూరి శంకర్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. తమిళ స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది.
కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్.. తిరిగి సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ఇలా సౌత్‌లోని నాలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు, సీరియల్స్‌తో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే అమ్మడు తన వ్యాఖ్యలతో తరుచూ వివాదాల్లో నిలుస్తుంటుంది. ఆ మధ్య బిగ్‌బాస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ భామ తెలుగు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసింది.

ఓ రాజకీయ సభలో ఆమె మాట్లాడుతూ..అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు వచ్చారంటూ కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు అయింది. ఈ కేసులో కస్తూరి శంకర్ మూడు రోజులు జైలు జీవితం కూడా గడిపారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ జైలులో ఎలా ఉంటుందో వివరించారు. జైలు లోపలికి వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళ్తామని కస్తూరి శంకర్ వివరించారు.
పుట్టినప్పుడు ఎలా ఉంటాయో అలాగే చెక్ చేస్తారని ఆమె తెలిపింది. ఒంటి మీద నూలుపోగు లేకుండా చెక్ చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే చెక్ చేసేవాళ్లు లేడిస్ ఉంటారని ఈ భామ తెలిపింది. అయితే నా ప్రైవేట్ పార్ట్స్‌లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారని కస్తూరి శంకర్ చెప్పారు. మూడుసార్లు గుంజీలు తీయిస్తారని చెప్పుకొచ్చారు. జైలులో కిందే పడుకోవాలని ఆమె తెలిపారు. అల్లు అర్జున్‌కు సైతం ఇదే జరిగి ఉంటుందని ఆమె తెలిపింది. రిమాండ్ ఖైదీ ఎవరికైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుందని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications