పవన్ కల్యాణ్ పార్టీకి అందుకే ఓటు వేయలేదు ..తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికి ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషి సినిమాతో పవన్ కల్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
పవన్ కల్యాణ్ కెరీర్‌తో బ్లాక్ బాస్టర్ హిట్‌గా ఖుషి సినిమా నిలిచింది. ఆ తర్వాత ఆయనకు పదేళ్ల పాటు హిట్ సినిమా లేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీ స్థాపించారు. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ గత ఎన్నికల వరకు ప్రజాక్షేత్రంలో తనని తాను నిరూపించుకోలేక పోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలిచి పవన్ కల్యాణ్ .. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తాను పోటీ చేసినా రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్.. తన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోలేక పోయారు.

ఈ క్రమంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లిన పవన్ కల్యాణ్ మరోసారి టీడీపీ, బీజేపీలతో జతకట్టారు. 2024లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్నీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కూటమి విజయం సాధించడంతో పవన్ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. పవన్ విజయం కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తమ వంతు కృషి చేసింది. పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ కూడా పవన్ గెలుపుకు కృషి చేశారు. పవన్ కల్యాణ్ గెలుపులో వీరందరూ కూడా భాగస్వాములయ్యారు.అయితే ఓ హీరోయిన్ మాత్రం తాను పవన్ కల్యాణ్‌కు ఓటు వేయలేకపోయానని తెలిపింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు "కోర్ట్" సినిమా హీరోయిన్ శ్రీదేవి. "కోర్ట్" సినిమాతో శ్రీదేవి ఒక్కసారిగా పాపులర్ అయింది.
శ్రీదేవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు తాను పెద్ద అభిమానని, కానీ గత ఎన్నికల్లో ఆయనకు తాను ఓటు వేయలేకపోయానని చెప్పుకొచ్చింది. అయితే దానికి గల కారణంగా కూడా ఆమె వివరించింది. ఎన్నికల సమయానికి తనకు ఓటు హక్కు రాలేదని, ఆ కారణంగానే తాను జనసేనకు ఓటు వేయలేకపోయానని ఈ యంగ్ బ్యూటీ తెలిపింది. అయితే తనకు తెలిసిన వారందరితోనూ పవన్ కల్యాణ్ పార్టీకి ఓటు వేయించానని పేర్కొంది. ఇలా పవన్‌పై తనుకున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించానని శ్రీదేవి తెలిపింది.
ఇక "కోర్ట్" సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా మార్చి 14న విడుదలయింది. ఈ సినిమాకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. హర్ష రోషన్, శ్రీదేవి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాని నాని నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని నటీనటులు తమ పాత్రల్లో జీవించేశారు. ముఖ్యంగా రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్థన్ ఇలా సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ మైండ్ లో ప్రింట్ అయిపోతుంది. ఈ సినిమాలో శ్రీదేవి జాబిలి అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలోని శ్రీదేవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications