2025లో అతిపెద్ద ఫ్లాప్ మూవీ ఇదే..!
2025 లో చిన్న సినిమాలదే హవా నడిచింది. చాలా చిన్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అలాగే అనేక పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. భారీ బడ్జెట్ చిత్రాలు అందుకు తగిన అంచనాలను అందుకోలేకపోయాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చాయి. అందులో స్టార్ డైరెక్టర్ మణిరత్నం, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ మూవీ మొదటి స్థానంలో ఉంది. అప్పట్లో మణిరత్నం సినిమాలు అంటే ఓ క్రేజ్.. జనాలు కళ్లు మూసుకుని థియేటర్ కు వెళ్లిపోయేవారు. కానీ కొంతకాలంగా ఆయన సినిమాలు ప్లాఫ్ టాక్ ను తెచ్చుకుంటున్నాయి. మణిరత్నం గత సినిమాలు పొన్నియన్ సెల్వన్ పార్ట్1,2 లు తమిళంలో ఘన విజయం సాధించినా.. తెలుగులో మాత్రం ఆశించినంత విజయం సాధించలేదు.
ఇక మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేదు. డిజాస్టర్ గా నిలిచింది. 80 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 97 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నాయగన్ సినిమా తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీగానే అంచనాలు నెలకొన్నాయి. కానీ కథనం బాగోలేక ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. అంతుకు ముందు విడుదల సమయంలో పలు వివాదాల్లోనూ చిక్కుకుంది ఈ చిత్రం. ఇక 2025 లో ఇదే అతిపెద్ద ఫ్లాప్ కావడం గమనార్హం.

ఇక కమల్ హాసన్ రచనా సహకారంతో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, మహేంద్రన్ తదితరులు నిర్మించారు. ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటుగా త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, శ్రీకర్ ప్రసాద్, రవి కే చంద్రన్ సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా జూన్ 5 న విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.












Click it and Unblock the Notifications