నా భర్త కామ పిశాచి..పీరియడ్స్ టైంలోనూ వదలడు..తెలుగు హీరోపై భార్య కామెంట్స్
టాలీవుడ్ యువ నటుడు ధర్మ మహేశ్ మీద ఆయన భార్య చిరుమామిళ్ల గౌతమి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అదనపు కట్నం కోసం, అలాగే శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె ఈ ఫిర్యాదు చేసింది.
2019లో ప్రేమ వివాహం చేసుకున్న ధర్మ మహేశ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన గౌతమిల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. మహేశ్‌కు సినీ అవకాశాలు పెరగడంతో విలాసాలకు అలవాటు పడి, అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడని గౌతమి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఈ సమస్యలపై పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా మహేశ్ తీరు మారలేదని ఆమె ఆరోపించారు.

గౌతమి మీడియా ముందు మాట్లాడుతూ.. పీరియడ్స్ సమయంలో కూడా మహేశ్ లైంగికంగా వేధించాడని ఆరోపించారు. అంతేకాకుండా, గౌతమి తండ్రి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీని మహేశ్ తన పేరు మీదికి మార్చుకున్నాడని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ వేధింపులకు మహేశ్ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.
గౌతమి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ధర్మ మహేశ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై BNS సెక్షన్లు 85, 115(2), 316(2), 351(2), 352 తో పాటు సెక్షన్ 4 ఆఫ్ డీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రింకర్ సాయి, సిందూరం వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన ధర్మ మహేశ్, ఇలాంటి కేసులో చిక్కుకోవడం అతని కెరీర్‌కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications