CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సాయి ధరమ్ తేజ్..
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి ఆదివారం వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ మధ్యే యూట్యూబ్ లోని ఒక వీడియోకు సంబంధించి సాయి ధరమ్ తేజ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీని సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశాడు.
సాయి ధరమ్ తేజ్ ట్వీట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. వీడియోపై స్పందించిన సాయి ధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలుపుతూ పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం కూడా సాయి ధరమ్ తేజ్ ట్వీట్ కు స్పందించారు. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన ప్రవర్తనతో తండ్రి, కూతురు మధ్య ఉన్న రిలేషన్ గురించి తప్పుగా చిత్రీకరించాడు.

దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. "వావివరుసలు లేకుండా ఫన్నీ పేరుతో చిన్నపిల్లలను ట్రోల్స్ చేస్తున్న ప్రణీత్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరకుతున్నా" అని ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు, డీజీపీ, పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. ప్రణీత్ హనుమంతుతో పాటు ముగ్గురురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ప్రణీత్ పై 67బీ ఐటీ, ఫోక్సో, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ప్రణీత్ ను ఏ 1 గా, ఏ2గా నాగేశ్వర్ రావు, ఏ3గా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణను పోలీసులు పేర్కొన్నారు.
ప్రణీత్ హనుమంతు ఎఫెక్ట్‌తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Maa) కూడా అలెర్టయింది. ఆర్టిస్ట్‌లపై లేనిపోని రాతలు, వీడియోలతో రెచ్చిపోతున్న యూట్యూబ్ ఛానల్స్‌పై బ్యాన్ విధించనున్నారు. ప్రణీత్ హనుమంతు ఇష్యూ సమయంలో 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. ఇలాంటి వారి రాతల కారణంగా ఆర్టిస్ట్‌లు ఎంతగా నలిగిపోతున్నారో తెలుపుతూ ఓ వీడియోను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మా అసోసియేషన్ ఐదు యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్ విధించింది.












Click it and Unblock the Notifications