చిరంజీవి, రాజశేఖర్‌ మధ్య గొడవకు ప్రధాన కారణం అదొక్క సంఘటనే

మెగాస్టార్ చిరంజీవి, యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ మధ్య విభేదాలు అనేవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్నాయి. వీటిపై చర్చ జరుగుతూనే ఉంటుంది. వీరిద్దరి మధ్య గొడవ అనేది చిన్న కారణంతో మొదలైంది. కాలక్రమేణా అనేక సంఘటనలు దీనికి తోడై తీవ్రస్థాయి విభేదాలుగా మారాయి. ప్రస్తుతానికి బాగానే ఉంటున్నప్పటికీ అంతర్లీనంగా ఆ వివాదాలతో ఏర్పడిన గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతూ వస్తోంది.

ప్రధాన కారణం 'మా' ఎన్నికలు

ప్రధానంగా వీరిమధ్య గొడవ జరగడానికి ప్రధాన కారణం.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు. ఆ సమయంలో చిరంజీవి ప్యానెల్‌కు వ్యతిరేకంగా రాజశేఖర్-జీవిత దంపతులు గళం విప్పడం అప్పట్లో సంచలనమైంది. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో, రాజశేఖర్, జీవిత ఆ పార్టీని, చిరంజీవి నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ విషయంలో రాజశేఖర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. రాజశేఖర్ చేసిన విమర్శల తర్వాత ఓరోజు తను ప్రయాణిస్తున్న కారుపై చిరంజీవి అభిమానులు దాడి చేయడంతో వీరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఆ తర్వాత చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి క్షమాపణ కోరినప్పటికీ, మనస్పర్థలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.

Tollywood That incident was the main reason for the rift between Chiranjeevi and Rajasekhar

ఆ విమర్శలు వివాదాస్పదంగా మారాయి

రాజశేఖర్ చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏదీ మనసులో ఉంచుకోరు. ఉన్నది ఉన్నట్లుగా అనేసి అక్కడితో ఆగిపోతారు. అయితే కొన్నిసార్లు పబ్లిక్ వేదికలపై రాజశేఖర్ శ్రుతి తప్పి చిరంజీవిపై చేసిన విమర్శలు సరికాదని సినీ విశ్లేషకులు భావిస్తారు. అందులో ప్రధానంగా చిరంజీవి సేవా కార్యక్రమాలపై విమర్శలు మరింత వివాదాస్పదంగా మారాయి.

రాజశేఖర్ కారుపై చిరు అభిమానుల దాడి

చిరంజీవి నేరుగా ఎప్పుడూ రాజశేఖర్‌ను విమర్శించలేదు. కానీ, రాజశేఖర్ కారుపై అభిమానులు చేసిన దాడి ఘటన చిరు ఇమేజ్‌కు కొంత నష్టం కలిగించింది. ఒక నాయకుడిగా తన అభిమానులను అదుపు చేయడంలో చిరంజీవి విఫలమయ్యారని చెప్పొచ్చు. కొన్నేళ్లుగా వీరిద్దరూ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మర్యాదపూర్వకంగానే మెలుగుతున్నారు. 2020లో జరిగిన ఒక 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మళ్ళీ చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత జరిగిన కొన్ని ఫంక్షన్లలో ఇద్దరూ కలిసి కనిపించారు.

తాము స్నేహపూర్వకంగానే ఉన్నామని చెప్పారు. అయితే రాజశేఖర్ కొనుగోలు చేసిన ఠాగూర్ సినిమాను చిరంజీవి, అల్లు అరవింద్ ఆ సినిమా నిర్మాతతో మాట్లాడుకొని, వారు దాన్ని తమవైపు తిప్పుకొని రాజశేఖర్ కు అన్యాయం చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయం సినీ పరిశ్రమలో అందరికీ తెలుసంటారు. ఏదేశమైనప్పటికీ ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఇప్పుడు స్నేహంగానే ఉండటం మాత్రం ఇద్దరి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+