తెలుగులో టాప్-10 డిజాస్టర్ మూవీస్ లిస్ట్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాలు పరాజయం పొందడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం అత్యంత దారుణమైన ఫలితాలను అందుకుంటుంటాయి. అందుకు అనేక కారణాలుంటాయి. కథ బాగోలేకపోవడం, డైరెక్టర్ అసమర్థత... ఇలాంటివి చాలా ఉంటాయి. ఎన్నో అంచనాలతో వచ్చికూడా ప్రేక్షకుల ముందు డుమ్మా కొట్టినవి చాలా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మన తెలుగులో టాప్ 10 డిజాస్టర్ మూవీస్ ఏవి అనే వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

1. ఈ జాబితాలో మొదటి సినిమాగా గేమ్ ఛేంజర్ (2025) నిలుస్తుంది. శంకర్ దర్శకత్వం రొటీన్ రొడ్డకొట్టుడుగా ఉండి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చింది.

Tollywood Top 10 Disaster Movies List Films which failed with huge budget delayed shooting

2. రెండో సినిమాగా ఆచార్య (2022) నిలుస్తుంది. వరుసగా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో చిరు, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. చిరంజీవి కథలో వేలు పెట్టడంవల్ల అని కొందరు అంటుంటారు. చిరంజీవి మాత్రం షూటింగ్ స్పాట్ లో శివ కథకు మెరుగులు దిద్దేవాడని విమర్శించారు.

3. ప్రభాస్ -పూజాహెగ్డే నటించిన రాధేశ్యామ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమా దారుణంగా విఫలమైంది.

4. విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. లైగర్ ను సినీ ప్రియులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

5. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అజ్ఞాత వాసి (2018) సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా దారుణంగా బోల్తా కొట్టింది. అంచనాలే అందుకోలేకపోయింది.

6. మహేష్ బాబు, మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ (2017) తెలుగు, తమిళ భాషల్లో భారీగా ఖర్చు పెట్టినప్పటికీ రికవరీలో ఘోరంగా విఫలమైంది.

Tollywood Top 10 Disaster Movies List Films which failed with huge budget delayed shooting

7. జూనియర్ ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి (2011) అప్పట్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కింది.సినిమా కూడా అదేస్థాయిలో, ఫ్లాప్ లో కూడా రికార్డు నెలకొల్పింది.

8. అఖిల్, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన ఏజెంట్ (2023) సినిమాలో కథ లేదు.. కథనం లేదు.. షూటింగ్ ఆలస్యం.. భారీ బడ్జెట్.. అంతా కలిసి సినిమాను బ్రహ్మాండమైన ఫ్లాప్ సినిమాగా తీర్చిదిద్దాయి.

9. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం (2016) మొదటిరోజు మొదటి ఆట నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకొని భారీ పరాజయం పాలైంది. మహేష్ బాబు కెరీర్ లో మాయని మచ్చలా ఈ సినిమా నిలిచిపోయింది.

10. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ (2024) అయితే ఎందుకు తీశారో తెలియకుండా, అర్థం కాకముందే థియేటర్ల నుంచి మాయమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+