Top 10 Heroines..టాప్ వన్ లో అలియా భట్, సమంత, రష్మిక ఎక్కడున్నారంటే!!

సినిమా ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి ఒక్కొక్క హీరో, హీరోయిన్లను అభిమానించే ప్రేక్షకుల మనసు, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. సహజంగా సినిమాలలో ఉండే హిట్, ఫ్లాప్ లను బట్టి, హీరో హీరోయిన్లకు వచ్చే అవకాశాలను బట్టి, సినీ ఇండస్ట్రీలో వారికి ఉన్న క్రేజ్ ను బట్టి ఎవరు టాప్ వన్ లో ఉన్నారు.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది అంచనా వేస్తుంటారు.

హీరోయిన్ల టాప్ 10 జాబితా వెల్లడించిన ఆర్మాక్స్
ప్రతినెల ఆర్మాక్స్ మీడియా సంస్థ అభిమానుల ఓటింగ్ ను ఆధారం చేసుకుని టాప్ టెన్ హీరోయిన్ల జాబితాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మే నెలలో విడుదల చేసిన జాబితాలో టాప్ వన్ లో ఎవరున్నారు.. ఆ తరువాత స్థానాలలో ఎవరున్నారు అనేది వెల్లడించింది.

Top 10 Heroines alia bhatt in top 1 full list is here

టాప్ 1 లో స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ, టాప్ 2లో సమంత
ఈసారి టాప్ వన్ లో అలియా భట్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్లో తనకంటూ ఒక క్రేజ్ ఉన్న అలియా భట్, తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈసారి టాప్ టులో పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సమంత నిలిచింది.

టాప్ 3, 4 లో వీళ్ళే
ఇక టాప్ త్రీ లో జవాన్ సినిమా ద్వారా అందరినీ ఆకట్టుకున్న దీపికా పదుకొనే నిలిచింది. ఇక టాప్ ఫోర్ స్థానంలో నిలిచిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. యానిమల్ సినిమాతో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్న రష్మిక, పుష్ప టు తో అందరిని ఆకట్టుకోబోతున్నారు

టాప్ 5లో కాజల్ అగర్వాల్, టాప్ 6 ఎవరంటే
ఇక టాప్ ఫైవ్ లో కాజల్ అగర్వాల్ నిలిచారు. పెళ్లి చేసుకున్న తర్వాత తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మాత్రం ఆమె ఇంకా టాప్ ఫైవ్ లోనే ఉన్నారు. ఇక టాప్ సిక్స్ లో కృతి సనన్ నిలిచారు. గత సంవత్సరం ఆది పురుష్ సినిమాతో పాటు గణ్ పథ్ సినిమాలో నటించిన కృతి సనన్ భారీగానే ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు.

టాప్ 7 నుండి 10 వరకు ఉన్న హీరోయిన్లు వీరే
ఇక టాప్ సెవెన్ లో కత్రినా కైఫ్ నేనిలిచారు. టాప్ 8 లో కియారా అద్వానీ, టాప్ నైన్ లో టాలీవుడ్ క్యూట్ బ్యూటీగా, తన డాన్సులతో అదరగొడుతున్న శ్రీ లీల నిలిచారు. ఇక టాప్ టెన్ లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార నిలిచారు. అభిమానులు తమ హీరోయిన్లపై అభిమానంతో చేసిన ఓటింగ్ ఆధారంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ మే నెల కు గాను ఈ సర్వే చేసి ఫలితాలను విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+