డబ్బులు తీసుకోవడంలో టాప్-10 హీరోలు... ఇక్కడ మాత్రం తగ్గరు!

సినిమా నిర్మించాలని నిర్మాత భావిస్తే బడ్జెట్ లో 70 శాతం హీరోకు, దర్శకుడికే పోతోంది. మిగిలినదాంతోనే ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పారితోషికాన్ని సర్దుబాటు చేస్తారు. హీరోలు తమ పారితోషికాన్ని తక్కువగా తీసుకుంటే మరిన్ని సినిమాలు వస్తాయని, పరిశ్రమ కళకళలాడుతుందని, కార్మికులకు పని దొరుకుతుందని దాసరి నారాయణరావులాంటి దర్శకులు ఎన్నోసార్లు బతిమలాడినట్లు చెప్పేవారుకానీ ఎవరూ ఆయన మాటను చెవికెక్కించుకోలేదు. వారికంటే తామే ఎక్కువ పారితోషికం తీసుకోవాలి.. నెంబర్ వన్ గా నిలవాలని అనుకుంటారేకానీ నిర్మాత పరిస్థితి ఏమిటి, ఇతర నటీనటుల పరిస్థితి ఏమిటి? లాంటివన్నీ వారు పట్టించుకోరు. అలా ఏమీ పట్టించుకోకుండా తమ స్వార్థం తాము చూసుకుంటారు కాబట్టే హీరోలయ్యారు. వీరంతా వెండితెరపై హీరోలేకానీ నిజజీవితంలో మాత్రం జీరోలు.

మొదటి స్థానంలో అల్లు అర్జున్
ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల గురించి తెలుసుకుందాం. వారం రోజుల నుంచి అల్లు అర్జున్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పుష్ప2 సినిమాకు మూడున్నర సంవత్సరాలు కేటాయించినందుకు రూ.300 కోట్ల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వాటిని సినిమా టీం కూడా ఖండించలేదుకాబట్టి అదే అధికారికమైంది. దీంతో అల్లు అర్జున్ పారితోషికం విషయంలో 2024లో నెంబర్ వన్ హీరోగా నిలిచారు. తర్వాత 2వ స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ నిలిచారు. గోట్, లియో సినిమాలకు ఆయన రూ.200 కోట్లు తీసుకుంటే రాబోయే సినిమాకు రూ.275 కోట్లు తీసుకుంటున్నారు. 3వ స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు. ఆయన రూ.150 నుంచి రూ.250 కోట్లు తీసుకుంటున్నారు.

top 10 highest paid heros details here

4వ స్థానంలో నిలిచిన రజనీకాంత్
తర్వాత 4వ స్థానంలో రజనీకాంత్ నిలిచారు. ఆయన కూడా రూ. 150 నుంచి రూ.250 కోట్ల వరకు తీసుకుంటున్నారు. 5వ స్థానంలో అమీర్ ఖాన్ రూ.100 నుంచి రూ.250 కోట్లు తీసుకుంటున్నారు. 6వ స్థానంలో ప్రభాస్ రూ.100 నుంచి రూ.200 కోట్లు తీసుకుంటున్నారు. 7వ స్థానంలో అజిత్ రూ.100 నుంచి రూ.160 కోట్లు తీసుకుంటున్నారు. 8వ స్థానంలో సల్మాన్ ఖాన్ రూ.100 నుంచి రూ.150 కోట్లు, 9వ స్థానంలో కమల్ హాసన్ రూ.100 నుంచి రూ.150 కోట్లు, 10వ స్థానంలో అక్షయ్ కుమార్ రూ.65 కోట్ల నుంచి రూ.140 కోట్ల వరకు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వీరు ఇంకా పారితోషికాన్ని పెంచే యోచనలోనే ఉంటారుకానీ తగ్గించే ఆలోచన అస్సలు చేయరు. అందుకు తగినట్లుగానే నిర్మాతలు కూడా వారు అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంతిమంగా మొదటి రెండు వారాల్లో టికెట్ ధరలు పెంచుకొని అభిమానుల నుంచి, ప్రజల నుంచి దోచుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+