అన్న సినిమాకు రూ. 100 కోట్లు బొక్క..!
తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యమా అంటూ తెలుగు సినిమాల ఖ్యాతి పెరిగింది. ఆయన చూపించిన మార్గంలో పలు తెలుగు దర్శకులు సైతం ప్యాన్ ఇండియా రేంజ్ సత్తా చాటుతున్నారు. పుష్ప-2 సినిమా సైతం నేషనల్ లేవల్లో బాగా ఆడింది. కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా బహుబలి రికార్డులను కొల్లగొట్టింది. ఇలా వారిని ఆదర్శంగా తీసుకుని పలువురు ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
అయితే అవసరం లేకపోయిన కొందరు ప్యాన్ ఇండియా పిచ్చితో భారీగా ఖర్చులు నష్టాలను చవి చూస్తున్నారు. ఇలా భారీగా ఖర్చు పెట్టిన ఓ సినిమా ఇప్పుడు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. ఆ సినిమా మరేదో కాదు.. మంచు విష్ణు నటించి, నిర్మించిన "కన్నప్ప". మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్ల విషయంలో మాత్రం బాగా వెనుకబడింది. 'కన్నప్ప' మొదటి రోజు రూ.9 కోట్లకు పైగా వసూలు చేసి, మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

ఈ సినిమా కోసం విష్ణు చాలానే కష్టపడ్డారు. అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం రాలేదు. మంచు విష్ణు తన మార్కెట్ స్థాయిని దాటి మరీ ఈ సినిమాకు ఖర్చు పెట్టడం జరిగింది. సినిమా మొత్తం కూడా న్యూజిలాండ్‌లోనే షూటింగ్ చేశారు. దీంతో ఖర్చు భారీగా అయింది. దీనికి తోడు అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ ఆగర్వాల్ వంటి స్టార్స్‌ని పెట్టుకోవడం వల్ల కూడా ఈ సినిమా ఖర్చు భారీగా పెరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎక్కువ అయింది. సినిమా విడుదలై 20 రోజులు కావొస్తోంది.
కలెక్షన్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో లేవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద 'కన్నప్ప' సందడి తగ్గిపోయింది. ఇక బాక్సాఫీస్ వద్ద "కన్నప్ప" కథ ముగిసినట్టే అని చర్చ సాగుతోంది. మంచు విష్ణు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో సినిమాకు రూ.200 కోట్లకు పైగా ఖర్చయిందని పేర్కొన్నారు.ఎంత తీసేసిన ఈ సినిమాకు రూ.100 కోట్ల నష్టం తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఈ సినిమాను కాపాడలేకపోయారు. మరి ఈ సినిమా ఫలితంపై నిర్మాత, హీరో మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications