చిత్ర పరిశ్రమలో విషాదం..ప్రముఖ యాంకర్ మృతి..
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, యాంకర్ అపర్ణా వస్తరే (57) మృతిచెందారు. ఆమె గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటూనే ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి బెంగళూరులో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. యాంకర్ అపర్ణ మృతిపై కన్నడ సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
సంతాపం ప్రకటించిన సిఎం..
అపర్ణ వ్యాఖ్యాతగానే కాకుండా, నటిగా రేడియో జాకీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో కూడా నటించారు. అనంతరం బుల్లితెరలో అడుగుపెట్టి పలు టీవీ సీరియల్స్, షోలలో అలరించారు. వీటితోపాటు పలు షోలకు యాంకర్‌గా కూడా వ్యవహిరించారు. బెంగుళూరులోని నమ్మ మెట్రో రైలులో ప్రయాణీకులకు సూచనలు అందించే గాత్రం నటి అపర్ణదే. అయితే ఈమె గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ మృతిచెందారు. ఆమె మృతిపై కర్ణాటక సిఎం సిద్ధా రామయ్య సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.

రేడీయో జాకీగా..
1966 అక్టోబర్ 14న అపర్ణ చిక్ మంగుళూరులో జన్మించారు. 'మసనాడ పువ్వు' అనే కన్నడ చిత్రంతో ఆమె తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 'సంగ్రామ' 'నమ్మూర రాజా' వంటి చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఇన్‌స్పెక్టర్ విక్రమ్ వంటి సినిమాలోనూ ఆమె కీలకమై పాత్ర పోషించారు. ఆమె చివరి చిత్రం 'గ్రే గేమ్స్' . పలు సీరియల్స్‌లో కూడా నటించారు. అపర్ణ 'వివిధ భారతి' ఛానల్ లో రేడియో జాకీగా కూడా పని చేశారు.












Click it and Unblock the Notifications