బాబు ల్యాండ్ అయ్యాడు.. నందిపై శివుడి తాండవమే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీకి వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు. నందిపై మహేశ్ బాబు త్రిశూలం పట్టుకుని వస్తున్న దృశ్యాలు గూస్ బంబ్స్ తెప్పిస్తున్నాయి. ఇక హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ గ్రోబ్ ట్రోటర్ గ్రాండ్ ఈవెంట్ కు కొద్దిసేపటి క్రితమే రాజమౌళి, దంపతులు, మహేశ్ బాబు దంపతులు వచ్చారు. అలాగే పృథ్వి రాజ్ సుకుమారన్, నటి ప్రియాంక చోప్రా ఈవెంట్ లో సందడి చేశారు.
#Varanasi :
— Gaurav Singh (@GauravP56180007) November 15, 2025
Unexpected 🤯🤯#MaheshBabu Look literally Cooked 🥶
Every frame looks like a 2000 Cr film 🎬
Deserves appreciation 🔥🙌🏻 #GlobeTrotter | #SSMB29 pic.twitter.com/6fBJTFdzz4
ఈ మూవీలో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ గా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక ఈ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉన్న భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి ఈవెంట్ ఎక్కడా జరగలేదని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ మూవీ కోసం ఇటీవల ఎం. ఎం. కీరవాణి కంపోజ్ చేసిన 'సంచారి' అనే పాటను నటి శ్రుతి హాసన్ పాడారు. ఈ సాంగ్ సామాజిక మాధ్యమాల్లో ఇన్ స్టంట్ గా వైరల్ అయింది. ఇవాళ జరగబోయే ఈవెంట్ లో ఆ పాటను లైవ్ పెర్ఫార్మ్ చేయనునట్లు తెలుస్తోంది మూవీ టీమ్. తాజాగా విడుదలైన మూవీ టైటిల్ వారణాసి కూడా గ్లోబల్ గా ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే ఎక్స్ లో ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ చక్కర్లు కొడుతోంది. అలాగే ఈ ఈవెంట్ 18ఏళ్ల లోపున్న వాళ్లకు, సీనియర్ సిటిజన్లకు ఎంట్రీ లేదని మూవీ మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోస్టార్ లో ఇది లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఈవెంట్ వద్దకు చిత్ర యూనిట్ మొత్తం వచ్చింది. ఈ ఈవెంట్ లో రిలీజ్ డేట్ తో పాటు సినిమాకు సంబంధించిన ఇతర ముఖ్యమైన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications