విజయ్‌పై పబ్లిక్‌గా ఓపెనైనా త్రిష ..కొత్త ప్రయాణం అంటూ
40 ఏళ్లు దాటినా కూడా తన అందంతో, అభినయంతో యువ నటీమణులకు పోటీ ఇస్తున్న నటి త్రిష. తన తర్వాత సినీ రంగ ప్రవేశం చేసిన ఎంతోమంది నటీమణులు కనుమరుగైపోయినా, త్రిష మాత్రం ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గా కొనసాగడం గొప్ప విషయం. తమిళంలోనే కాకుండా, తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర'లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో కూడా మరిన్ని అవకాశాలు వస్తాయని త్రిష ఆశపడుతోంది.
సినిమాలతో పాటు, వివాదాలతో కూడా త్రిష నిత్యం వార్తల్లో ఉంటుంది. చాలా కాలంగా కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతితో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్‌కు భార్య, పిల్లలు ఉన్నప్పటికీ, త్రిష ఆయన ప్రేమలోనే ఉందని, అందుకే పెళ్లి చేసుకోకుండా ఉందని కొందరు చెబుతుంటారు. గతంలో ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకున్న త్రిష, కొన్ని రోజులకే ఆ బంధాన్ని తెంచుకుంది.

అప్పటినుంచి ఆమె మళ్లీ ఎవరితోనూ రిలేషన్‌లో లేదని, విజయ్ మీద ప్రేమతోనే ఆమె పెళ్లికి దూరంగా ఉంటోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై విజయ్ కానీ, త్రిష కానీ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో విజయ్, త్రిష రిలేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఈ వేడుకలో త్రిషను స్టేజ్ మీదకి పిలిచి, విజయ్ ఫొటో చూపించారు. దీంతో విజయ్ అభిమానులు పెద్దగా కేకలు వేయగా, త్రిష సిగ్గుపడుతూ నవ్వులు చిందించింది.
ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. విజయ్ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ ఏది కలగన్నా అది తప్పక నెరవేరుతుందని, అందుకు ఆయన అర్హుడని ప్రశంసించింది. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ కొత్త సినిమా 'జన నాయగన్' సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, 2026 తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.












Click it and Unblock the Notifications