ప్రభాస్ తో సినిమా చేయడంపై బాంబు పేల్చిన త్రిష!
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో అందంగా ఉండేదెవరు అనే ప్రశ్న అడిగితే మొన్నటివరకు అందరూ ఐశ్వర్యరాయ్ పేరు చెప్పేవారు. కానీ కొన్నాళ్ల నుంచి ఐశ్వర్యరాయ్ పేరుకు బదులుగా అందరూ త్రిష పేరు చెబుతున్నారు. 40 సంవత్సరాల వయసు దాటినప్పటికీ, సీనియర్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ తన అందంతో అందరినీ కట్టిపడేస్తోంది. తమిళంలో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇటీవలే విజయ్ గోట్ సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష తెలుగులో తాను చేసిన వర్షం సినిమా సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంది.
40 రోజులకు పైగా వర్షంలో తడిశాను
ఆ సినిమా చేసే సమయంలో తాను 40 రోజులకు పైగా వర్షంలో తడుస్తూనే షూటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పింది. తన జీవితంలో అత్యంత కఠిన పరిస్థితుల్లో షూటింగ్ చేసిన చిత్రం వర్షం అని తెలిపింది. సినిమాకు ముందే దర్శకుడు శోభన్ వర్షంలోనే ఎక్కువ సన్నివేశాలుంటాయని చెప్పారని, అందుకు ఒప్పుకున్నానని తెలిపింది. ఈ సినిమా చిరంజీవి అంజి, బాలయ్య లక్ష్మీనరసింహ చిత్రాలకు పోటీగా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరోగా అవతరించగా, త్రిష స్టార్ హీరోయిన్ అయింది. దీనితర్వాత వీరిద్దరూ కలిసి పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో త్రిష అనేక సినిమాలు చేసింది.

ప్రభాస్ తో సినిమా చేయడం మరిచిపోలేని అనుభవం
ప్రభాస్ తో సినిమాలు చేయడం మరిచిపోలేని అనుభవమని చెప్పింది. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర చిత్రం చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ సినిమాలో డార్లింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో పెద్ద ప్రభాస్ సరసన త్రిషను నటింపచేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్రిష ఒప్పుకుందా? లేదా? అనేది తెలియలేదు. అదే జరిగితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జంటను వెండితెరపై చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది. తమిళంలో కూడా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష వరుసపెట్టి సినిమాలను ఒప్పుకుంటోంది. తెలుగులో మరో స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయికానీ వాటిపి అధికారికంగా ధ్రువీకరణ లేదు. త్రిష ఒప్పుకుందా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications