విజయ్ పేరు ఎత్తగానే సిగ్గుల మొగ్గైన త్రిష!(వీడియో)
తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా నటి త్రిష కృష్ణన్ స్పందించే తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా, ఓ అభిమాని విజయ్ గురించి అడగ్గానే, త్రిష సిగ్గుతో నవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ సినీ సూపర్‌స్టార్ తలపతి విజయ్ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవి స్వీకరణతో అభిమానుల్లో అపూర్వమైన ఆనందం కనిపించింది. ఆయనకు సన్నిహితురాలైన త్రిష కృష్ణన్ సైతం ప్రమాణస్వీకారోత్సవంలో ఉద్వేగంగా కనిపించారు.
త్రిష కొత్త చిత్రం కరుప్పు ప్రీమియర్ షోకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు ఆమె కారును చుట్టుముట్టారు. ముఖ్యమంత్రి విజయ్‌కు ఏదైనా చెప్పాలని ఓ అభిమాని కోరగా.. త్రిష 'అవును' అంటూ సిగ్గుతో నవ్వింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. త్రిష హావభావాలను చూసి 'విజయ్ పేరు వినగానే సిగ్గుపడింది' అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, వ్యతిరేకులు మాత్రం విజయ్ భార్య సంగీత పేరును ప్రస్తావిస్తూ వివాదానికి ఆజ్యం పోశారు.

విజయ్, త్రిషల మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహార వార్తలున్నాయి. విజయ్ వివాహితుడు అయినందున, ఈ బంధాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సహనటుడితో సంబంధం కారణంగా ఆయన భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని నివేదికలు కూడా వెలువడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంపై అభిమానులు, సినీ ప్రముఖులు ఆసక్తిగా గమనిస్తున్నారు. విజయ్-త్రిషల సంబంధం గురించి భవిష్యత్తులో ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.
"Thalapathy ah kettenu sollunga"
— Deepu (@deepu_drops) May 15, 2026
Trisha replies, "Kandipa" 😅❤️ pic.twitter.com/CLZUTP3QIn












Click it and Unblock the Notifications