రూ.70 కోట్లు వేస్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్?
స్క్రిప్ట్ ను పూర్తిగా సిద్ధం చేసుకోకుండా సినిమాను సెట్స్ పైకి తీసుకువెళితే ఆ సినిమా ఫ్లాపవడం అనేదే మనందరికీ తెలుసు. కానీ అంతకన్నా మరో నష్టం నిర్మాతకు సినిమా విడుదలకు ముందే కలుగుతుంది. బడ్జెట్ వృథా అవుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. చాలామంది దర్శకులు బెటర్ ఔట్ ఫుట్ రాలేదంటూ తీసిందే తీయడంవల్ల బడ్జెట్ వేస్టవుతుంటుంది.
కొంతమంది స్టార్ డైరెక్టర్లు మాత్రం సినిమాను మరింత క్వాలిటీగా తీయాలనే తపనతో తీసిందే తీయడంతోపాటు మరికొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తుంటారు. దీనివల్ల ఫుటేజ్ ఎక్కువవడంతోపాటు బడ్జెట్ కూడా రోజురోజుకు పెరిగిపోతుంటుంది. జరిగేది చూస్తూ యూనిట్ అడిగిన సౌకర్యాలను కల్పిస్తుండటం మినహా నిర్మాత కూడ ఏమీ చేయలేని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితి రానీయవద్దని మెగాస్టార్ చిరంజీవి పదే పదే చెబుతుంటారు. ఇటీవలే వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ జరిగే సమయంలోను మరోసారి చిరంజీవి బహిరంగంగానే అందరు దర్శకులకు సూచించారు. చాలా సీన్లను పెద్ద దర్శకులు చెత్తకుప్పలో పడేస్తుంటారు. గుంటూరు కారం సినిమా విషయంలోను త్రివిక్రమ్ ఇలాంటి పొరపాటే చేసినట్లు తెలుస్తోంది. సినిమాను క్వాలిటీగా తీయాలని, స్క్రిప్ట్ ను ఇంప్రవైజ్ చేయాలంటూ చాలా సీన్లను చిత్రీకరించారు. ఫైనల్ గా వాటన్నింటినీ డస్ట్ బిన్ లో పడేశారు.
గుంటూరు కారం సినిమా విషయంలో త్రివిక్రమ్ ఇలా వృథా చేయించిన బడ్జెట్ రూ.40 కోట్లు అని తెలుస్తోంది. పోరాట సన్నివేశాలు తీసి వాటిని డిలిట్ చేసి, ఫైనల్ గా కొన్నిటినే వాడుకున్నారు. ఈ ఒక్క సినిమానే కాకుండా అల వైకుంఠపురం సినిమా విషయంలో కూడా రూ.30 కోట్లుపైనే వృథా చేసినట్లు సమాచారం. అగ్ర దర్శకులు ఇన్ స్పిరేషన్ గా వ్యవహరించాల్సింది పోయి వారే ఇలా బడ్జెట్ ను వేస్ట్ చేస్తుంటే చివరకు హీరోలే జోక్యం చేసుకొని వృథాను అరికట్టాలని ట్రేడ్ పండితులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications