రామ్ గోపాల్ వర్మ కథతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు
తెలుగు సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ కు ప్రత్యేక పేజీ ఉంటుంది. శివ చిత్రంతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తర్వాత అనేకమంది దర్శకులు ఈ సినిమా బాటలోనే, వర్మ శైలిలోనే నడిచారు. ఇటీవలికాలం నుంచి వివాదాస్పద నిర్ణయాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న వర్మ నుంచి సినిమా వస్తోందంటూ ఆసక్తిగా ఎదురుచూసేవారు తగ్గిపోయారు. దీనికి కారణం ఎంచుకుంటున్న కథలు మాత్రమే. కథలవల్ల సినిమాలకు పబ్లిసిటీ వస్తున్నప్పటికీ విజయాలను మాత్రం సాధించలేకపోతున్నాయి.
వర్మకు పూరీ జగన్నాథ్ శిష్యుడనే సంగతి తెలిసిందే. పోకిరి సినిమా తర్వాత మహేష్ బాబుతో పూరీ బిజినెస్ మెన్ చిత్రం చేసి సూపర్ హిట్ కొట్టాడు. సూర్యతో వర్మ రక్తచరిత్ర సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ముంబయిలో ప్రస్తుతం డాన్ ఎవరూ లేరని, కొత్తగా ఆ నగరంలోని డాన్ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏవిధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనే పాయింట్ ను పూరీకి వర్మ చెప్పాడు. దీన్ని ఆధారంగా చేసుకొని కథను తయారుచేయమన్నాడు.

తర్వాత కథను సూర్యకు వినిపించగా ఓకే చెప్పేశాడు. అయితే సినిమా చేయడానికి కాల్షీట్లు అందుబాటులో లేకపోవడంతోపాటు మరికొన్ని కారణాలవల్ల కుదరలేదు. చివరకు ఈ కథను పూరీ మహేష్ బాబుకు వినిపించగా ఓకే చెప్పేశాడు. సూర్యా భాయ్ పేరుతో బిజినెస్ మెన్ రూపుదిద్దుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత పూరీ-మహేష్ బాబు కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు. బిజినెస్ మెన్ చిత్రం కథ వినకుండానే పూరీమీద నమ్మకంతో మహేష్ ఓకే చేసేశాడు.












Click it and Unblock the Notifications