రూ.2500 కోసం ఆ పని కూడా చేశా..తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా వాళ్ల జీవితాలు పైకి అద్దంలా తళతళ మెరిసిపోతుంటాయి. కానీ ఆ అద్దం వెనుక చాలా వ్యధలు ఉంటాయనే విషయం వారికి మాత్రమే తెలుస్తుంది. ఇండస్ట్రీలో రాణించాలనే అందరు సినిమాల్లోకి వస్తుంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే క్లిక్ అవుతారు. అందం, టాలెంట్ రెండూ ఉన్నా అదృష్టం లేక చాలామంది హీరో, హీరోయిన్లు ఫేడ్ అవుతున్నారు. సరిగ్గా ఇలా ఫేడ్ అవుతున్న సమయంలోనే తన నిర్ణయాన్ని మార్చుకుని ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయింది వరలక్ష్మి శరత్ కుమార్.ఈ భామ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వరలక్ష్మి తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు అనే విషయం తెలిసిందే.
వరలక్ష్మి శరత్ కుమార్ తొలుత హీరోయిన్‌గా నటించింది. తమిళంలో వరుస సినిమాలు చేసింది. ఒకానొక దశలో తమిళ స్టార్ హీరో విశాల్‌తో ప్రేమలో ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే మేమిద్దరం కేవలం స్నేహితులమే అని వరలక్ష్మి శరత్ కుమార్ క్లారిటీ ఇచ్చింది. అయితే హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గిపోవడంతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది.క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరలక్ష్మి సూపర్ హిట్ అయింది. తెలుగు,తమిళ భాషల్లో విలన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. రవితేజ ''క్రాక్'' ,బాలకృష్ణ ''వీరసింహారెడ్డి'', 'హనుమాన్'.. సినిమాల్లో వరలక్ష్మి నటనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.వరలక్ష్మి శరత్ కుమార్ 2024లో నిచోలాయ్ సచ్‌దేవ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాల్లో నటిస్తోంది.

వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ డ్యాన్స షోలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడించింది. డబ్బుల కోసం తాను ఓ పని చేశానని.. ఆ పని వల్లే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది.తాను సినిమాల్లోకి రాకముందు తాను కూడా ఒక డ్యాన్సర్‌నేనని తెలిపింది.తాను ఒక ప్రముఖ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అందువల్ల ఎప్పుడూ రోడ్డు మీద డ్యాన్స్ వేయడం తప్పుగా భావించకూడదని పేర్కొంది.వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications