'వారణాసి' మూవీ ఫస్టాఫ్.. ఇంటర్వెల్.. క్లైమాక్స్ ఇదే..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వారణాసి ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా దాదాపు 120 కు పైగా దేశాల్లో కనీవినీఎరుగని రీతిలో విడుదల కానుంది. ప్రస్తుతం వారణాసి మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

అక్టోబర్ నాటికి షూటింగ్ ను పూర్తి చేసిన పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ ఎక్స్ వర్క్స్ పై చిత్ర యూనిట్ దృష్టి పెట్టనుంది. ఇక ఈ మూవీలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ అయిన కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఇక సీనియర్ హీరో ప్రకాశ్ రాజ్ సైతం ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్​ పై సీనియర్ నిర్మాత కే ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే వారణాసి మూవీ నుంచి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ సినిమాకు కోర్ అంశంగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారణాసి ఫస్టాఫ్ లో రుద్ర కు తన తండ్రికి ఉన్న ఎమోషనల్ సీన్స్ ప్రధానంగా నిలిచినట్లు తెలుస్తోంది. ఫస్టాఫ్ లో ఇవే హైలెట్ అని టాక్ వినిపిస్తోంది.

ఆ తర్వాత ఇంటర్వెల్ కు కొంత సేపటి తర్వాత గ్లోబ్ ట్రాటర్ గా ఉన్న రుద్ర శ్రీ రాముడిగా మారుతారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ను మనం గ్లింప్స్ లో చూడొచ్చు. ఇక ఆ తర్వాత క్లైమాక్స్ లో టైమ్ ట్రాటర్ రుద్రకు వారణాసిలో కుంభతో ఫైట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇదే కానీ నిజమైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉంది అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే.

Varanasi movie Mahesh Babu by Rajamouli here is the first half interval and climax of the movie

ఇక వారణాసి మూవీపై మలయాళం హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారణాసి మూవీ కేవలం టైమ్ ట్రావెల్ స్టోరీ కాదని అంతకు మించిన రేంజ్ లో ఉంటుందని తెలిపారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ప్రియాంక చోప్రా, మహేష్ బాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వివరించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+