Varanasi ఊచకోత.. కేవలం ఓవర్సీస్‌లో రైట్స్‌కే అన్ని రూ.కోట్లా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ 'వారణాసి' (Varanasi) ప్రస్తుతం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకగా, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వినిపిస్తున్న ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాలను షేక్ చేస్తోంది.
సాధారణంగా ఒక పెద్ద సినిమాకు వచ్చే థియేట్రికల్ బిజినెస్ రేంజ్ లో, కేవలం 'వారణాసి' ఓవర్సీస్ హక్కుల కోసమే ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ. 160 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇది కేవలం ఇండియన్ భాషలకు సంబంధించిన లెక్క మాత్రమే కావడం విశేషం. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే, విదేశీ మార్కెట్ లో ఇంతటి భారీ ధర పలికిన తొలి ఇండియన్ మూవీగా 'వారణాసి' సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ గ్లోబల్ లెవల్ లో ఏ స్థాయిలో ఉందో ఈ ఆఫరే నిదర్శనం.

రాముడిగా మహేష్.. విలన్ గా పృథ్వీరాజ్..
రాజమౌళి ఈ చిత్రాన్ని కేవలం ఒక సినిమాగా కాకుండా, ఒక ఫాంటసీ-మైథలాజికల్ వండర్ లా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు 'రాముడి' ఛాయలున్న పాత్రలో కనిపించబోతుండగా, మందాకినిగా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మహేశ్ ను ఢీకొట్టబోతున్నారు. ఈ స్టార్ కాస్టింగ్ సినిమాపై ఉన్న హైప్ ను రెట్టింపు చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా Varanasi భారీ విడుదల..
భారతీయ సినిమా చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా దాదాపు 120కి పైగా దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అత్యధిక దేశాల్లో రిలీజ్ కాబోతున్న ఇండియన్ మూవీగా 'వారణాసి' చరిత్ర సృష్టించబోతోంది. 2027 ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని వందల కోట్లను కొల్లగొడుతుందోనని ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications