ఆ హీరో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాడు.. మహేష్ బాబు హీరోయిన్లు సంచలనం
ఓ హీరో తీరు వల్ల చాలామంది హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు.పబ్లిక్ ప్లేస్‌లు అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. ఆ హీరో మరెవ్వరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్. బాలీవుడ్ స్టార్ హీరోల్లో వరుణ్ ధావన్ కూడా ఒకరు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. అతను 2012 నుండి 2018 వరకు 11 వరుస బాక్సాఫీస్ విజయాలను సాధించాడు. అతను 2014 నుండి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించాడు. అతను 2021లో నటాషా దలాల్‌ను వివాహం చేసుకున్నాడు.
అయితే వరుణ్ ధావన్ తన ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. హీరోయిన్లతో మనోడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. సినిమా షూటింగ్‌ల్లోనే కాకుండా, పబ్లిక్ ప్లేస్‌ల్లో కూడా హీరోయిన్లపై అతను తన బిహేవియర్ విచిత్రంగా ఉంటుంది. పబ్లిక్‌లోనే హీరోయిన్లకు ముద్దులు పెట్టడం, వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడం వంటివి చేయడం చేస్తుంటాడు. దీంతో కొందరు హీరోయిన్లు అతనిపై అక్కడిక్కడే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

వరుణ్ ధావన్ హీరోయిన్లను తాకిన వీడియో
కియారా అద్వానీ, కృతి సనన్, శ్రద్ద కపూర్, జాన్వీ కపూర్, అలియ భట్ వంటి హీరోయిన్లు మనోడి బారిన పడ్డవారే. వీరిందరిని కూడా పబ్లిక్ ప్లేస్‌ల్లో వారి అనుమతి లేకుండా ముద్దులు పెట్టడం, హగ్ చేసుకోవడం, ఎత్తు కోవడం వంటివి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఇదే హీరోతో తెలుగు హీరోయిన్లు నటిస్తున్నారు. సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో నటించింది. కీర్తి సురేష్ 'బేబీ జాన్' సినిమాలో నటించింది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.












Click it and Unblock the Notifications