Varun Tej - Lavanya: హైదరాబాద్ లో "మెగా" కపుల్ - మరో వేడుకకు సిద్దం..!!
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌కు చేరుకున్నారు. పెళ్లి వేడుకల అనంతరం తొలిసారిగా మెగా కోడలి హోదాలో లావణ్య త్రిపాఠి నగరంలో అడుగుపెట్టారు. ఇటలీ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌తో వివాహాబంధంలో అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్, నితిన్ దంపతులు పాల్గొన్నారు. దాదాపు మూడు రోజుల పాటు టుస్కానీలో ఈ వేడుకలు జరిగాయి. మరో భారీ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంటకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీరితో పాటే మెగాస్టార్ ఫ్యామిలీ, రామ్ చరణ్- ఉపాసన కూడా హైదరాబాద్ వచ్చేశారు. కాగా.. సినీ ప్రముఖుల కోసం ఈనెల 5న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ సండది చేసిన ఈ వెడ్డింగ్ ఫొటోలు..వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరితో పాటే మెగాస్టార్ ఫ్యామిలీ, రామ్ చరణ్- ఉపాసన కూడా హైదరాబాద్ వచ్చేశారు. వివాహం కోసం ఇటలీకి వెళ్లిన మెగా ఫ్యామిలీ హీరోలు ఒక్కొక్కరిగా తిరిగి హైదరాబాద్ లో అడుగుపెడుతున్నారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ ఇటలీ నుంచి హైదరాబాద్ కి చేరుకున్న ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈ రోజు కొత్త జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు హైదరాబాద్ కి చేరుకున్నారు. రేపు జరిగే రిసిప్షెన్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఈ రిసిప్షెన్ కు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. మెగా ఇంట జరుగుతున్న ఈవెంట్ కావటంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications