రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లిపై బాంబు పేల్చిన వేణు స్వామి (వీడియో)
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.
దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హాయతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టైయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ మరోసారి సీఎంలుగా ప్రమాణస్వీకారం చేస్తారని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. అయితే అక్కడి నుంచే ఆయనకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. అన్నటి నుంచి వేణు స్వామి జాతకాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరి గురించి వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.
గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ..విజయ్‌తో పెళ్లి వద్దని రష్మికకు చెప్పానని..వీరి పెళ్లిలో అనేక దోషాలు ఉన్నాయని, దీనితో ఇద్దరు పెళ్లి చేసుకున్న ఆ తర్వాత వివాదాలు చుట్టుముడతాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఒకవేళ పరిహారాలు చేయించుకుంటే వీరి వైవాహిక జీవితం బాగుంటుందని మాత్రమే చెప్పగలనని, మిగిలింది కర్మ ఫలితమే అంటూ షాకింగ్ కామెంట్ప్ చేశారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకోవడంతో .. వీరికి సంబంధించి వేణు స్వామి మాట్లాడిన వీడియో మళ్లీ ట్రెండ్ అవుతోంది.












Click it and Unblock the Notifications