తెలంగాణలో కాంగ్రెస్ తరఫున వెంకటేష్ ప్రచారం?

విక్టరీ వెంకటేష్ ఎక్కువ విజయాల శాతం ఉన్న కథానాయకుడు. దాదాపుగా ఆయన సినిమాలన్నీ కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఉంటాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. తన సినిమా లోకంలోనే ఆయన నిత్యం ఉంటారు. బయట విషయాలను పట్టించుకోరు. రాజకీయాలకు అసలే దూరంగా ఉంటాయి. అయితే ఈసారి వెంకీ రాజకీయాల్లోకి రావడం ఖాయమని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఆయన వియ్యంకుడు. కాంగ్రెస్ పార్టీ తాజాగా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి పేరు కూడా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రఘురామిరెడ్డి వెంకటేష్ కు స్వయానా వియ్యంకుడు. వచ్చేనెల 13వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. రామసహాయం ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగారు. రఘురాంరెడ్డికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ కుటుంబాలతో సన్నిహిత పరిచయాలున్నాయి.

victory Venkatesh campaign for Congress in Telangana

సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ కుటుంబాలతో కూడా ఆయనకు బంధుత్వం ఉంది. వెంకటేష్ కుమార్తె ఆశ్రితను ఆయన పెద్దకొడుకు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని ఆయన చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. వెంకటేష్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతున్నాడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో, పరిశ్రమలో వార్తలు వైరల్ మారాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఒకవేళ ప్రచారం చేయాల్సి వస్తే వెంకటేష్ తన వియ్యంకుడి నియోజకవర్గం ఖమ్మం వరకే ప్రచారం చేస్తారని వెంకీ అభిమానులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+