ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! (వీడియో)
ప్రేమకు భాష అక్కర్లేదని, అభిమానుల పట్ల ఉన్న గౌరవానికి హోదా అడ్డురాదని టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి నిరూపించారు. ఈ జంట మధ్య ఉన్న రియల్ లైఫ్ కెమిస్ట్రీ కేవలం సినిమాలకే పరిమితం కాదని.. వారి వ్యక్తిత్వం కూడా అంతే గొప్పదని నిరూపించుకున్నారు. తన పెళ్లికి పిలవలేదని అలిగిన ఓ చిట్టి ఫ్యాన్ కోసం ఈ స్టార్ కపుల్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. తమ పెళ్లికి పిలవలేదని సోషల్ మీడియాలో అలిగిన ఓ చిన్నారి ఫ్యాన్ కోరికను తీర్చి అందరి మనసు గెలుచుకున్నారు.
అసలేం జరిగిందంటే?
కొన్ని వారాల క్రితం ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అందులో ఆ పాప, విజయ్ దేవరకొండ తన పెళ్లికి ఎందుకు పిలవలేదని.. కనీసం లడ్డూలు కూడా పంపలేదని ఎంతో ముద్దుగా నిలదీసింది. ఈ వీడియో విజయ్ దేవరకొండ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. "నువ్వు అస్సలు బాధపడకు.. నిన్ను మా ఇంటికి పిలిచి నేనూ, రష్మిక స్వయంగా వంట చేసి పెడతాం" అని రౌడీ హీరో మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారమే విజయ్ దేవరకొండ ఆ చిన్నారిని తన ఇంటికి ఆహ్వానించాడు.

మురిసిపోయిన చిన్నారి.. ముద్దాడిన రష్మిక!
ఆ చిన్నారి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. విజయ్ దేవరకొండ ఆ చిన్నారిని చూడగానే ఎంతో ప్రేమతో ఎత్తుకుని ఇంటి లోపలికి తీసుకెళ్లాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి.. రష్మిక స్వయంగా ప్లేటులో లడ్డూలు వడ్డించి ఆ పాప నొసటిపై ముద్దు పెట్టారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ స్వయంగా అన్నం వడ్డిస్తూ ఆ పాపపై ప్రేమ కురిపించారు. భోజనం పూర్తయ్యాక విజయ్ దేవరకొండ ఆ పాపను ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ కబుర్లు చెప్పాడు. రష్మిక కూడా ఆ చిన్నారితో ఎంతో సరదాగా గడిపింది.
ఫ్యాన్స్ ఫిదా.. 'వీజూ-రోషూ' అంటే అందుకే ఇష్టం!
ఈ వీడియో చూసిన నెటిజన్లు విజయ్, రష్మికల ఆతిధ్యానికి ఫిదా అవుతున్నారు. "అందుకే మిమ్మల్ని అందరూ అంతలా ప్రేమిస్తారు" అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరుపుకున్న ఈ జంట.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అన్నదానం కూడా చేశారు. చిన్నారి ఫ్యాన్ పట్ల వారు చూపిన ఈ చొరవ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినీ సెలబ్రిటీలు తమ బిజీ షెడ్యూల్‌లో కూడా ఓ సామాన్య అభిమాని కోరికను గుర్తుపెట్టుకుని నెరవేర్చడం నిజంగా అభినందనీయం. విజయ్-రష్మికల ఈ వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చట వేయక మానదు.
-
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
రణవీర్ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !!










Click it and Unblock the Notifications