చిరంజీవిపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1980-90ల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. అగ్ర హీరోలతో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. అంతే కాకుండా ఈ జోడికి మోస్ట్ హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు వచ్చింది.ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయిన్‌టైన్ చేశారనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి. ఇక రాజకీయాల్లో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేశారు.
ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మగా కీర్తి గడించారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో పని చేశారామె. ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. విజయశాంతి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చిరంజీవితో కలిసి పని చేయడాన్ని తాను బాగా ఎంజాయ్ చేస్తానని ఆమె తెలిపారు. అయితే సదరు యాంకర్ మాట్లాడుతూ... 80 బ్యాచ్‌కు చెందిన ఆర్టిస్టులంతా ప్రతి సంవత్సరం ఒక చోట కలిసి ఎంజాయ్ చేస్తుంటారు కదా మీరు ఆ పార్టీకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. దానికి విజయశాంతి సమాధానం ఇస్తూ.. నన్ను చిరంజీవి ఎప్పుడూ ఆ పార్టీలకు పిలవలేదు. ఒకవేళ పిలిచిన తాను పార్టీలకు వెళ్లనని విజయశాంతి చెప్పుకొచ్చారు.అలాంటి పార్టీలకు నేను చాలా దూరంగా ఉంటానంటూ విజయశాంతి పేర్కొన్నారు. షూటింగ్, రాజకీయాలు, ఇళ్లు అంతే తప్పితే పార్టీలకు వెళ్లను అంటూ స్పష్టం చేసింది. అందుకే ఎటువంటి పార్టీల్లో కనిపించనని విజయశాంతి తెలిపారు. విజయశాంతి ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications