విరాట్ కోహ్లీ సంచలన పోస్ట్.. అనుష్క శర్మకు విడాకులు..?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీ-క్రీడా రంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మ కూడా ఒకరు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైతే, అనుష్క శర్మ బాలీవుడ్‌లో ప్రముఖ నటి. వీరిద్దరి కలయిక సినీ-క్రీడా ప్రేమికులను ఒకే చోట చేర్చింది. ఆ యాడ్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది.
కొన్నాళ్లు రిలేషన్‌లో వీరిద్దరు తర్వాత తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత, 2017లో ఇటలీలో సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. విరాట్,అనుష్క దంపతులకు కూతురు , కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా విరాట్ కోహ్లీ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.

అందులో 'వెనక్కి తిరిగి చూసుకుంటే మేం ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటాం. మేం ఒక అభిరుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా.. రెండుసార్లు మిస్‌ఫిట్ అయ్యాం. అయితే నేను విమర్శలను, ప్రశంసలను రెండింటిని పట్టించుకోను. ప్రస్తుతం నేను ఎవరో తెలుసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాను. గడిచిన 10 సంవత్సరాల నా కెరీర్‌లో ఎప్పుడూ కూడా అపజయాలు నన్ను కదించలేదు. అలాగే విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు.
— Virat Kohli (@imVkohli) November 20, 2024
10 సంవత్సరాల కిందట సరైనది అని అనిపించిన విషయం ఇప్పుడు సరైనది కావొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్లిపోవాలి' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విరాట్ కోహ్లీ అనుష్క శర్మకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోహ్లీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోహ్లీ దీనిపై క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications