వ్రతం తర్వాత మటన్ తిన్న బాలయ్య హీరోయిన్.. నెట్టింట ట్రోలింగ్ వార్!

"ఆషిక్ బనాయా ఆప్నే" పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె ఒక షాకింగ్ వీడియోను పంచుకుంది. అందులో తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని ఆరోపించింది. ఈ సంఘటన మరువకముందే ఆమె ఇప్పుడు మాంసాహారం గురించి ఒక సుదీర్ఘ పోస్టును పెట్టింది. మటన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దానిని ఆయుర్వేద సూత్రాలతో ముడిపెట్టడం గమనార్హం. అయితే ఆమె శ్రావణ వ్రతం ఉన్న తర్వాత మటన్ తిన్నానని చెప్పడంతో కొందరు నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు.

తనుశ్రీ దత్తా వివిధ రకాల ప్యాకెట్లలో ఉన్న మటన్ కొవ్వు గురించి వివరిస్తూ.. అది తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించింది. తన క్యాప్షన్‌లో ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది. ఆహారం ప్రతి ఒక్కరికీ ఔషధం లాంటిందని ఆమె పేర్కొంది. తన డైట్ ఆలోచనాత్మకంగా, ఆయుర్వేద ఆధారితంగా ఉంటుందని.. ఎందుకంటే ఆహారాన్ని ఔషధంలా భావిస్తానని తనుశ్రీ దత్తా రాసింది. ఎల్లప్పుడూ ఆహారంపై శ్రద్ధ చూపుతానని.. అందుకే ఈ విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నానని ఆమె రాసుకొచ్చింది.

Vrat After Mutton Feast Tanushree Dutta Faces Online Backlash Over Shraavan Controversy

శ్రావణ వ్రతం తర్వాత మటన్.. వివాదానికి కారణం
శ్రావణ మాసం హిందువులకు పవిత్రమైన మాసం. ఈ నెలలో చాలా మంది ప్రజలు ఉపవాసాలు ఉంటూ, మాంసాహారాన్ని విడిచిపెడతారు. అలాంటిది తనుశ్రీ దత్తా శ్రావణ వ్రతం ఉన్న తర్వాత మటన్ తిన్నానని ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఆమె ఒక ప్రత్యేకమైన మటన్ థాలీని తయారు చేసుకుని తిన్నానని వెల్లడించింది. "ఈ రోజు నేను శ్రావణం సందర్భంగా సాయంత్రం 7 గంటల వరకు వ్రతం ఉన్నాను. ఆ తర్వాత డిన్నర్‌లో నాకు నేనుగా ఈ పోషకాలు నిండిన నల్ల శనగ పప్పు, మటన్, అన్నం థాలీని తయారు చేసుకున్నాను" అని ఆమె వెల్లడించింది.

ప్రజల ఆగ్రహం
ధార్మిక నియమాలను కఠినంగా పాటించాల్సిన అవసరం లేదని తనుశ్రీ దత్తా తన పోస్ట్ లో పేర్కొంది. ప్రతి వ్యక్తికి వారి శరీర అవసరాలు ఉంటాయని, తనకు అలాంటి వ్రతం ఉత్తమంగా ఉంటుందని చెప్పింది. "వ్రతం కూడా అవుతుంది, అదే సమయంలో మానసిక ఆరోగ్యం కూడా పటిష్టంగా ఉంటుంది. ఉపవాసం విరమించినప్పుడు, అధిక ప్రోటీన్, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం లభిస్తుంది, దీని వల్ల శరీరం కూడా అత్యుత్తమ స్థితిలో ఉంటుంది" అని ఆమె ప్రయోజనాలను వివరించింది.

అయితే శ్రావణ మాసంలో వ్రతం ఉండి మటన్ తినడంపై నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించాడు. "శ్రావణ మాసంలో మాంసం, చాలా బాగుంది మేడమ్" అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా రాశాడు. "శ్రావణంలో ఇదంతా ఏమిటి చూపిస్తున్నారు?" అని మరొకరు ప్రశ్నించారు. ఒక అభిమాని అయితే.. శాకాహారిగా మారితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తనుశ్రీకి సలహా ఇచ్చారు.

ట్రోలింగ్‌కు తనుశ్రీ ఘాటు సమాధానం
తనుశ్రీ దత్తా తనను ట్రోల్ చేసిన వారికి ఘాటుగా బదులిచ్చింది. ఒక యూజర్ "శ్రావణం, వ్రతం మటన్, గొప్ప హ్యాష్‌ట్యాగ్ గౌరవం" అని రాసిన వ్యాఖ్యకు సమాధానంగా, బెంగాల్‌లో అన్ని వ్రతాలు ఇలాగే జరుగుతాయని పేర్కొంది. సాయంత్రం వరకు కేవలం నీటితో ఉపవాసం ఉండి, ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే భోజనం (అది తరచుగా మేక మాంసం) తింటారని చెప్పింది. "ప్రతి ఒక్కరికీ వారిదైన సంస్కృతి ఉంటుందని, ఎవరినీ విమర్శించకూడదని" తనుశ్రీ దత్తా వారికి హితవు పలికింది. "ఆరోగ్యం,వ్యక్తిగత నమ్మకాలపై అనవసరంగా విమర్శలు చేయడానికి వచ్చిన వారికి ఇదే నా సమాధానం" అన్నట్లుగా ఆమె స్పందన ఉంది.ఈ సంఘటన మత విశ్వాసాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఒక చర్చకు దారితీసింది.

అయితే తనుశ్రీ దత్తా సినిమాల విషయానికొస్తే 2005లో వీరభద్ర సినిమాలో బాలయ్యతో నటించింది. 2013లో ఆమె చివరి సినిమా బాలీవుడ్ లో నటించి అనంతరం బ్రేక్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+