గ్రేట్ తెలివి: వ్యూహం సినిమాను ఎన్నికల సమయంలో విడుదలయ్యేలా చేసిన నారా లోకేష్..
Vyooham trailer: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని చిత్రీకరించిన సినిమా ఇది. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. ఎన్నో న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొని, ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటించాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌ను మానస రాధాకృష్ణన్ పోషించారు. ఈ సినిమా షూటింగ్.. దాదాపుగా విజయవాడ, గుంటూరు పరిసరాల్లో సాగింది.

రెండు భాగాలుగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంది. ఫస్ట్ పార్ట్ ఈ నెల 23వ తేదీన విడుదల కానుంది. శపథం పేరుతో తెరకెక్కిన రెండో భాగం.. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే వైఎస్ జగన్ పాదయాత్రను కథాంశంగా తీసుకుని నిర్మించిన యాత్ర 2 మూవీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వ్యూహం, శపథం ఎలా ఉండబోతోన్నాయనేది ఆసక్తి రేపుతోంది.
నిజానికి- గత ఏడాది డిసెంబర్‌లో వ్యూహం రిలీజ్ కావాల్సి ఉండగా.. దీన్ని అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కోర్టుకెక్కారు. సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ సెన్సార్ బోర్డుకూ లేఖ రాశారు. ఆ తరువాత తెలంగాణ హైకోర్టులోనూ పిటీషన్లు దాఖలు చేశారు.
దీనితో ఈ సినిమా విడుదలలో జాప్యం చోటు చేసుకుంది. తీరా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకున్న దశలో విడుదల కాబోతోంది. ఇప్పుడదే హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఒప్పుకొన్నారు. నారా లోకేష్‌కు థ్యాంక్స్ చెప్పారు.
ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు ఆర్జీవీ. చంద్రబాబు, నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు. ఎప్పుడో డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను లాగి లాగి ఎన్నికల వరకు తెచ్చినందుకు నారా లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. సరైన టైమ్‌లో సినిమా విడుదల అయ్యేలా చేసినందుకు లోకేష్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు ఆర్జీవీ. అది ఆయన గ్రేట్ తెలివిగా అభివర్ణించారు.
అప్పుడే విడుదల అయివుంటే ఈ సినిమాను అందరూ మర్చిపోయి ఉండేవారని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. నారా లోకేష్ వేసిన పిటీషన్ వల్ల ఆలస్యమైందని, ఎన్నికల సమయంలో విడుదల అవుతోందని, ఈ టైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోండటం తనకు, నిర్మాతకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. ఒక సినిమా విడుదలను డిలే చేయగలుగుతారే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ ఆపలేరని తేల్చి చెప్పారు.
నారా లోకేష్ మీద ఒట్టు పెడుతున్నానని, ఇది ఎవ్వరినీ ఉద్దేశించి తీసింది కాదని నవ్వుతూ చెప్పారు రామ్ గోపాల్ వర్మ. నారా లోకేష్‌ను ఎందుకు టార్గెట్ చేశారంటూ విలేకరులు అడగ్గా.. ఆయనే తన సినిమాను టార్గెట్ చేసి.. సినిమా విడుదలను అడ్డుకున్నారని బదులిచ్చారు.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications