నాగచైతన్య-శోభిత విడిపోవడానికి కారణమయ్యే మహిళ ఆమేనా?
సమంతను ప్రేమించి పెళ్లిచేసుకున్న నాగచైతన్య విడాకులిచ్చేశారు. తాజాగా శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగబోతోంది. అయితే వీరిద్దరి నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీన జరగ్గా అదేరోజు ప్రముఖ్య వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి వీరిద్దరి కాపురం సజావుగా సాగదని, పెళ్లయిన మూడు సంవత్సరాలకే విడిపోతారని, అందుకు కారణం ఓ మహిళ అని చెప్పారు. నిశ్చితార్థం జరిపిన ముహూర్త బలం బాగోలేకపోవడమే ఇందుకు కారణమని, ఇటువంటి ముహూర్తాన్ని ప్రతి ఒక్కరూ పెడుతుంటారని, అది మంచి ముహూర్తం కాదన్నారు. వారిద్దరి జాతకాలను బాగా విశ్లేషించి తాను ఈ విషయం చెబుతున్నానని, 2027లో విడిపోవడం ఖాయమన్నారు.
వేణుస్వామిపై తీసుకునే చర్యలపై ఉత్కంఠ
వేణుస్వామి వీడియోపై, వ్యాఖ్యలపై తెలుగు సినిమా జర్నలిస్టులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ వేణుస్వామితోపాటు అతని వ్యాఖ్యలను, వీడియోలను ప్రసారం చేసిన ఛానెళ్లపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆగస్టు 13వ తేదీన వేణుస్వామికి కమిషన్ నోటీసులు జారీచేయగా అతను కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఆ స్టేను ఎత్తేస్తూ మహిళా కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని, వేణుస్వామిపై వారంరోజుల్లోగా చర్యలు తీసుకోవాలని కమిషన్ ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అతనిపై మహిళా కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

తిరిగి ఆమెకే దగ్గరవుతాడా?
అయితే నాగచైతన్య-శోభిత మహిళ వల్ల విడిపోతారని వేణుస్వామి చెప్పాడు. ఆ మహిళ ఎవరై ఉంటారు? అని నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతున్నారు. తాజాగా సమంత తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, కానీ విడిపోవాల్సి వచ్చిందని, తన జీవితంలో మరే వ్యక్తికి, రెండో పెళ్లికి ఎటువంటి అవకాశం లేదని స్పష్టం చేసింది. దీనిపై నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శోభితతో కాపురం చేస్తున్న సమయంలోనే నాగచైతన్య తిరిగి సమంతకే దగ్గరవుతారని, దీనివల్లే శోభితతో విడిపోవాల్సి వస్తుందేమోననే అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే చాలా మంచిదని, తిరిగి నాగచైతన్య-సమంత కలిసినట్లవుతుందంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications