అయోధ్య రామ మందిరం కార్యక్రమానికి డుమ్మా, కేజీఎఫ్ రాఖీభాయ్ ఏం చెప్పాడంటే !
శ్రీ రాముడు అయోధ్యకు రాకతో శతకోటి హిందువుల కల నిన్న నెరవేరింది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ వేడుకను తిలకించేందుకు బాలీవుడ్, వుడ్, టాలీవుడ్, కోలీవుడ్, స్యాండిల్ వుడ్ నుంచి స్టార్ హీరోలు, పెద్ద పెద్ద నటీనటులు అయోధ్యకు తరలివెళ్లారు. అయితే కేజీఎఫ్ ఫేమ్ యష్‌ని అయోధ్యకు ఆహ్వానించినా ఆయన మాత్రం ఆ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో అనేక చర్చలు మొదలైనాయి.
అయితే అయోధ్యలోని రామ మందిరం గురించి, శ్రీరాముడి గురించి హీరో యష్ ఏమన్నారో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రాముడి నామస్మరణతో దేశమంతా మార్మోగిపోయింది. ఇంటింటిలో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. ఒక్క అయోధ్యలోనే కాదు యావత్ దేశం నిన్న రామమందిర ప్రతిష్ఠాపన వేడుకలను జరుపుకుంది. ఇదిలా ఉంటే నటుడు రాకింగ్ స్టార్ రాఖీభాయ్ యష్ ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదు అని జోరుగా చర్చ జరుగుతోంది.

ఇప్పుడు ఈ ప్రశ్నకు హీరో యష్ నుంచి సమాధానం వచ్చింది. నటుడు యష్ శ్రీరాముడిని స్మరించుకుంటూ ఆయన అభిమానులకు ఓ మెసేజ్ పంపించాడు. కేజీఎఫ్ సినిమాలో రాకీభాయ్‌గా నటించిన నటుడు యశ్ అయోధ్యలోని శ్రీరాముడి గురించి ఏమన్నారో తెలుసుకున్న ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో లాల్ లల్లా ప్రాణ ప్రతిష్ట్ర సందర్భంగా పలువురు బాలీవుడ్ నటులు, నటీమణులు హాజరయ్యారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే కన్నడిగ యష్ కూడా అయోధ్యకు వెలుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే కేజీఎఫ్ హీరో యష్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. హీరో యష్ ఎందుకు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు? అనే ప్రశ్న తలెత్తింది. హీరో యష్ ఇప్పుడు శ్రీరాముడి గురించి ట్వీట్ చేశారు. శ్రీ రాముడు గురించి యష్ ఏమన్నాడంటే?.
Namana to Maryada Purushottama Lord Rama: the epitome of Dharmic life, leading by example, reverence for relationships, resilience in adversity, and boundless compassion
— Yash (@TheNameIsYash) January 22, 2024
Truly an epic day for us all
Jai Shree Ram🙏 pic.twitter.com/vorivjbjbO
ధర్మబద్ధమైన జీవితం, మానవ, కుటుంబ సంబంధాల పట్ల గౌరవం, కష్టాల్లో స్థిరత్వం, అపరిమితమైన కరుణకు, ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ శ్రీరాముడు అంటూ హీరో యష్ ట్వీట్ చేశాడు. ఇది నిజంగా మనందరికీ ఒక మరుపురాని రోజు, జై శ్రీరామ్ అంటూ నటుడు యష్ ట్వీట్ చేశారు. అలాగే రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో ఉన్నందున అయోధ్యలో జరిగిన కార్యక్రమానికి హాజరుకాలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే అయోధ్యలో జరిగే కార్యక్రం కంటే సినిమా షూటింగ్ ముఖ్యమా అంటూ యష్ అంటే గిట్టని వాళ్లు కొందరు అతన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
కేజీఎఫ్ సినిమాతో తన స్టార్ హోదాను పెంచుకుని రాత్రికిరాత్రి పాన్ ఇండియా స్టార్ అయిపోయిన రాఖీభాయ్ యష్ అతని 19వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. 2022లో విడుదల అయిన కేజీఎఫ్ 2 సినిమా ఏకంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. కేజీఎఫ్-2 తర్వాత యష్ సినిమాలేవీ ప్రకటించలేదు. యష్-19వ సినిమా కోసం ఆయన అభిమానుతో పాటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూవారు. అందరికి షాక్ ఇచ్చిన హీరో యష్ అతని కొత్త సినిమా టాక్సిక్ అని పేరు పెట్టి నటీనటులు, దర్శకురాలిని పరిచం చెయ్యడంతో అందరూ షాక్ అయ్యారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..!












Click it and Unblock the Notifications