సినిమా చేద్దామని చిరంజీవి కోరగా.. కుదరదని చెప్పిన స్టార్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనగానే దర్శకులంతా ఎగిరి గంతేస్తారు. ఆయన దగ్గర నుంచి అవకాశం రావడమే ఆలస్యం అన్నట్లుగా ఉంటారు. ఎందుకంటే అంతటి అగ్రశ్రేణి కథానాయకుడితో సినిమా చేస్తే తాము కూడా స్టార్ డైరెక్టర్ గా మారిపోతామని ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. అటువంటి చిరంజీవి ఓ దర్శకుణ్ని పిలిచి ఈ సినిమా చేద్దామంటూ స్క్రిప్ట్ కూడా ఇచ్చినప్పటికీ చేయనని భయపడుతూ ముఖంమీదే చెప్పేశాడు. దానికి చిరంజీవి ఏమాత్రం నొచ్చుకోకుండా సరే అన్నారు. అయితే అదే దర్శకుడితో తర్వాత సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.

వేరేవారి కథతో తాను సినిమాలు చేయను
చిరంజీవి మళయాళం సినిమా లూసిఫర్ ను గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చేయడానికి పలువురు దర్శకులను సంప్రదించారు. వారిలో సుజిత్, బాబీ లాంటివారు కూడా ఉన్నారు. కానీ వారెవరూ ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు.. ఆసక్తి చూపించలేదు. అలాగే బాబీ కూడా చేయనన్నాడు. నేను అనుకున్న చిరంజీవి వేరు.. నేను అభిమానులకు చూపించే చిరంజీవి వేరు అని, వేరేవారి కథతో తాను సినిమాలు చేయనని, తన సొంత సినిమాతోనే చేస్తానని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశాడు. వేరేవారి కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందని, అందుకు సర్దార్ గబ్బర్ సింగ్ నిదర్శనని వివరించారు.

When Chiranjeevi asked to make a film the star director said no

నువ్వు ఏవిధంగా అనుకుంటున్నావో అలాగే చూపించు
సరే.. అలా అయితే నువ్వు నన్ను ఏ విధంగా చూపించాలనుకుంటున్నావో కథను చెప్పు.. అలాగే చేద్దాం అని బాబీని చిరంజీవి కోరారు. కొద్దిరోజుల సమయం తీసుకున్న బాబీ తర్వాత వెళ్లి వాల్తేరు వీరయ్య కథను చెప్పగా అది చిరంజీవికి బాగా నచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నారు చిరు. త్రిష కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానరుపై రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. మే నెలలో విడదల కానుంది. తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా, తర్వాత బాబీతో మరో సినిమా చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+