మోక్షజ్ఞను పరిచయం చేసే డైరెక్టర్ అతనేనా?
ఐదారు సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో పెండింగ్ వార్త ఏదన్నా ఉందా? అంటే.. అది నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యు మూవీ. అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోంది అనడమే కానీ అతనికి సంబంధించిన అప్ డేట్ గా ఏ వార్తా లేదు. అదిగో పులి అంటే ఇదిగో మేక అనేవారు. అయినా తమ హీరో శుభవార్త వినిపించకపోతాడా అంటూ బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచిచూసేవారు. ఈ ఏడాది కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందని.. వచ్చే ఏడాది తొలి విడుదలవుతుందని తాజాగా బాలకృష్ణ చేసిన ప్రకటన అభిమానుల్లో ఆసక్తిని రేపింది.
మోక్షజ్ఞ తన తొలి సినిమాను ఏ బ్యానర్ లో చేయబోతున్నారు? నిర్మాత ఎవరు? అతన్ని పరిచయం చేసే దర్శకుడు ఎవరు? అనేది ఉత్కంఠగా మారింది. బాలయ్యకు సన్నిహితుడైన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తనకు బాలయ్య కూడా హామీ ఇచ్చారు. అది తొలి సినిమా అవుతుందా? లేదంటే రెండో సినిమా అవుతుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసేవారిపేర్లు పలువురివి వినిపిస్తూనే ఉన్నాయి. ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా ఉంటుందని, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. తర్వాత పూరీ జగన్నాథ్ పేరు బయటకు వచ్చింది. వారసులను చాలా గ్రాండ్ గా వెండితెరకు పరిచయం చేశారు. అలాగే బోయపాటి శ్రీను పేరు కూడా వినిపించింది.
తాజాగా బాలయ్యకు భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి పేరు కూడా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో మొదలుపెట్టి తాజాగా భగవంత్ కేసరి సినిమా వరకు ఏడు వరస సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ టైంలో అనిల్ వర్క్ నచ్చిన బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను అనిల్‌కి అప్పగించారంటూ ప్రచారం నడుస్తోంది. దానికి సంబంధించి రెండు లైన్లు కూడా అనిల్ చెప్పారంటున్నారు. అనిల్ మీద మంచి గురి కుదిురిన బాలయ్య ఎవరికి తన కొడుకును పరిచయం చేసే బాధ్యతను ఇస్తారా? అనేదానిపై రెండు నెలల్లో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications