తమిళనాడులో రిచెస్ట్ హీరో ఎవరో తెలుసా?
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమే కాకుండా తమిళ, కన్నడ, మళయాల పరిశ్రమల్లో కూడా పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సినిమాల్లో చేయడానికి ఆయా భాషల హీరోలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ పరిశ్రమలో కూడా పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ హీరోల పారితోషికాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళ పరిశ్రమలో అత్యధిక ధనవంతుడైన హీరో ఎవరు? అనే చర్చ నడుస్తోంది.
తమిళ సీమలో కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్, అజిత్ స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు. ఒక్కో సినిమాకు వీరు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుటున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఆస్తుల విలువ రూ.450 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పేరుతో ప్రొడక్షన్ సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు.

ఈ నిర్మాణ సంస్థతో కలిపి కమల్ కు రూ.600 కోట్ల ఆస్తులున్నాయని సమాచారం. రజనీకాంత్ ఆస్తుల విలువ రూ.450 కోట్లుగా ఉంది. అలాగే విజయ్ ఆస్తి విలువ రూ.410 కోట్లు కాగా, అజిత్ కు రూ.350 కోట్ల ఆస్తి ఉంది. సూర్యకు రూ.300 కోట్లు, కార్తీ కి రూ.110 కోట్లు, ధనుష్ కు రూ.160 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ , దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న కల్కి 2898 ఏడిలో కమల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలసిందే.
శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన భారతీయుడు 2 చిత్రం కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత తమిళనాడులో అత్యధిక ఆస్తులు కలిగిన హీరోగా కమల్ హాసన్ నిలిచారు. ఒక్క ఆస్తిపాస్తులనే కాకుండా అభిమానుల విషయంలోను, అవార్డుల విషయంలోను కమల్ దే పైచేయిగా ఉంటోంది.












Click it and Unblock the Notifications