ఈ ముగ్గురిలో టాప్ హీరో ఎవరు?

తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్, చెర్రీ పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా ఆ కోవలోకే చేరాడు. ప్రస్తుతం తను నటిస్తున్న పుష్ప2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. తారక్ దేవర చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతోంది. విజయదశమికి విడుదల కానుంది. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఎప్పుడు అనేది స్పష్టత రాలేదు.

ఇలా పాన్ ఇండియా హీరోలుగా మారిన ఈ ముగ్గురు హీరోల్లో టాప్ హీరో ఎవరు? అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది. అయితే ముగ్గురూ సమాంతరమైన స్టార్ డమ్ కలిగివున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిన తారక్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయని, ఆయనకు బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడిందంటున్నారు. అందుకు తగ్గట్లుగానే వార్ 2, దేవర, ప్రశాంత్ నీల్ చిత్రాలు కూడా తెరకెక్కబోతున్నాయి.

who is the top hero junior ntr and allu arjun and ramcharan

రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ హిట్ అయితే క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. తారక్, చెర్రీకి ఈ ఇమేజ్ రావడంవెనక రాజమౌళి కష్టం కూడా ఉంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ ను, జాతీయ ఉత్తమ నటుడిగా వచ్చిన అవార్డుద్వారా తనను తాను తీర్చిదిద్దుకోవడమే కాకుండా క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. జర్మనీలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడిగా నిలిచారు. టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు.

వాస్తవానికి వీరి ముగ్గురు సినిమాలు కలెక్షన్లు భారీగా వసూలు చేస్తున్నాయి. తెలుగు నుంచి హిందీ మార్కెట్ లోకి అడుగుపెట్టి ఎంతవరకు నిలబడతారనే విషయం కొంతకాలమైతేకానీ స్పష్టత రాదు. వారి సినిమాలు అందుకు తగ్గట్లుగా భారీ విజయాలు సాధించాల్సి ఉంది. దేవర, పుష్ప2, గేమ్ ఛేంజర్ విజయాలను బట్టి వారిలో ఎవరు టాప్ హీరో అనేది తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+