కేజీఎఫ్ హీరో యష్ ఎందుకు దూరంగా ఉంటున్నారో తేలిపోయింది, ఆ రోజు మోదీని కలిసినా !
బహుబాష నటి, తెలుగింటి ఆడపడుచు సుమలత కర్ణాటకలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అంత ఈజీ కాదన్న సంగతి తెలిసిందే. నేటికీ సుమలత రాజకీయ మార్గం అనుకున్నంత సులువు కాదని ఆమె తీసుకున్న నిర్ణయమే చెబుతోంది. సుమలత ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయాలని భావించారు.
అయితే సుమలత కోరిక మాత్రం నెరవేరలేదు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకున్న రోజు నుంచి సుమలతకు టికెట్ దక్కుతుందనే సందేహం నెలకొంది. అందరూ ఊహించినట్లుగానే మండ్య నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. దీంతో మండ్యలో సుమలత మళ్లీ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అందరికి సందేహం నెలకొంది. గత కొన్ని నెలలుగా సుమలత విషయంలో చాలా గందరగోళం నెలకొంది.

ఆ సందర్భంలో కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎప్పుడూ సుమలత పక్కనే నిల్చున్నాడు. గత లోక్‌సభ ఎన్నికల్లో దర్శన్, కేజీఎఫ్ హీరో యష్ కలసి సుమలతకు మద్దతు పలికి మండ్య మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. స్టార్ హీరోలు దర్శన్, యష్ ఇద్దరూ కలిసి మండ్య జిల్లాలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆత్మగౌరవం పోటీలో సుమలతను ఎంపీగా గెలిపించారు. ఈసారి కూడా సుమలతకు మద్దతుగా కేజీఎఫ్ హీరో యష్ రంగంలోకి వస్తాడని అంతా అనుకున్నారు.
అయితే హీరో యష్ మాత్రం సుమలత అంబరీష్ రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. ఈ దెబ్బతో రెబల్ స్టార్ అంబరీష్, సుమలత, యష్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. హీరో యష్ టాక్సిక్' సినిమా కోసం నిర్మిస్తున్న భారీ సిటీ సెట్ నిర్మాణం పనుల్లో నెల రోజుల క్రితం నుంచి బిజీగా ఉన్నారని తెలిసింది. మండ్య బీజేపీ టికెట్ ఆశించిన సుమలత చివరి నిమిషంలో చాలా తెలివిగా వ్యవహరించారు. ఆ సమయంలో సుమలత ఆమె మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించారు.
అలాంటప్పుడు ఈసారి కూడా యష్ మీ తరపున ప్రచారానికి వస్తారా? అన్నది ప్రజలు సుమలతను ప్రశ్నించారు. సుమలత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినా తాను ప్రచారంలో పాల్గొనబోనని హీరో యష్ సూచనప్రాయంగా చెప్పారని ప్రచారం జరుగుతోంది. శ్యాండిల్ వుడ్ హీరోలు యష్, దర్శన్ లు వేర్వేరుగా సినిమాలు చేస్తున్నారు. ఇద్దరి హీరోల కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో, వారి మీద ఎంత మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయో కూడా తనకు తెలుసు అని, వారి పనులు వాళ్లను చేసుకోనివ్వండి అంటూ ఇటీవల సుమలత అన్నారు.
10 నుంచి 20 రోజులు వాళ్లు తన కోసం అన్ని వదిలేసి వస్తే వారిని నమ్ముకున్న వాళ్ల నష్టపోతారని, సినిమా షూటింగులు నిలిచిపోతాయని, దాని వలనే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుందని, తన కోసం వాళ్లు అలా చెయ్యడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని సుమలత అన్నారు. హీరో యష్ తన కోసం తప్పకుండా వస్తాడని తనకు తెలుసు అని, అతను తనకు చాలా పెద్ద బలం అని సుమలత అన్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో దర్శన్‌తో పాటు యష్ కూడా తన కోసం 20 నుంచి 25 రోజుల పాటు ప్రచారం చేశారని, ఎన్ని విమర్శలు వచ్చినా ఆ ఇద్దరు హీరోలు తన కోసం ఎన్నికల ప్రచారం చేసి తనను గెలిపించి తన భర్త రెబల్ స్టార్ అంబరీష్ రుణం తీర్చుకున్నారని, కానీ ఈసారి యష్ కు కొన్ని ఇబ్బందులు ఉండి రాలేకపోయాడని, ఆయన బాధ తాను అర్థం చేసుకుంటానని మండ్య ఎంపీ సుమలత అన్నారు.
ప్రస్తుతం సుమలతతో పాటు ఏ రాజకీయ నాయకుడితోనూ హీరో యష్ కు సంబంధం లేదు, ఆయన ఏ పార్టీకి ప్రచారం చేసే సూచనలు కనిపించడం లేదు, గత నెలలో బెంగళూరులో పానీపూరి కిట్టి కొత్త జిమ్ సెంటర్ ప్రారంభోత్సవానికి హీరో యష్ హాజరయ్యారు. అప్పుడు కూడా సుమలతకు లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తారా? అని మీడియా అడిగినా ఆయన మాత్రం చాలా తెలివిగా సమాధానం చెప్పారు.
మీరు కొన్ని రోజులుగా తనను చూస్తున్నారని, నేను రాజకీయాల జోలికి వెళ్లడం లేదని, నా లక్ష్యం వేరు అని. నా పని వేరు అని. నేను అక్కడికి వెళుతున్నాను చెప్పండి, ఎక్కడికి వెళ్లడం లేదని, తాను సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని హీరో యష్ చెప్పాడు. ఇప్పుడు మండ్యలో సుమలత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యకపోవడంతో ఆమె తరపున ఎన్నికల ప్రచారానికి తెరదించేశారు.
అలాగే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాక్సిక్ సినిమా సెట్స్ పైకి వెళ్లగా, షూటింగ్ ఈ నెలలోనే బెంగళూరులో మొదలవుతోంది. దీని కోసం భారీ సెట్లు వేశారు. సుమలత ఎన్నికల బరిలో నిలిచినా యష్ ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని తేలిపోయింది. అయితే సుమలత కూడా లోక్ సభ ఎన్నికల నుంచి తప్పుకోవడంతో రెబల్ స్టార్ అంబరీష్, కేజీఎఫ్ హీరో యష్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications