బాలయ్యను చూసి ఇప్పుడైనా ఇతర హీరోలు గుణపాఠం నేర్చుకుంటారా?
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న నాలుగో చిత్రం అఖండ2. ఈ సినిమా విడుదలైంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేశాయి. వాస్తవానికి ఇతర హీరోలైతే టికెట్ ధరలను చాలా అధికంగా, రెండు వారాలపాటు అమల్లో ఉండేలా అనుమతులు తెచ్చుకునేవారు. అయితే బాలయ్య నిర్మాతలవైపు, ప్రజలవైపు.. ఇలా రెండువైపులా ఆలోచించి తెలంగాణలో 3 రోజులు, ఏపీలో 10 రోజులు మాత్రమే ధరలు అమల్లో ఉండేలా చూసుకున్నారు. ఒకరకంగా ఇతర హీరోలు బాలయ్య తీసుకున్న నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. కానీ చాలా దారుణంగా రూ.1500, రూ.1200, బెనిఫిట్ షోలంటూ దారుణంగా దోచుకుంటున్నారు.
10 రోజులకే వర్తింపు
ఏపీ ప్రభుత్వం అఖండ2 టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. 10 రోజులపాటు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్స్ లో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100గా నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం మల్టీప్లెక్స్ ల్లో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జీఎస్టీ కలుపుకొనే ఈ ధరలున్నాయి. 4వ తేదీ రాత్రి 8.00 గంటలకు ప్రత్యేకంగా వేసే షోకు 600 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే టికెట్ల అమ్మకాలు జరుగుతాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

3 రోజులకే వర్తింపు
అయితే ఈ టికెట్ ధరల పెంపు కేవలం మూడురోజులకే వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం కోసం వెచ్చిస్తారు. అలా అయితేనే టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తానని కొద్దిరోజుల క్రితమే రేవంత్ రెడ్డి చెప్పారు. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను ప్రారంభించింది. నిర్మాతలు 20 శాతం ఆదాయాన్ని అందులో జమచేయాలి.సినీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వమే నయం అని, వారికి న్యాయం చేస్తేనే అనుమతులిస్తానని రేవంత్ స్పష్టంగా చెప్పారంటూ ప్రజల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. కానీ పరిశ్రమ పెద్దలు మాత్రం వారి గురించి మాత్రమే ఆలోచించుకొని, కార్మికులను మాత్రం వారి మానాన వారిని వదిలేసేవారు.












Click it and Unblock the Notifications