జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్ర చేసుంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచేవాడు

వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 2010లో వచ్చిన అదుర్స్ సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో తారక్ నటన హైలైట్ గా నిలిచింది. బ్రహ్మానందం-తారక్ మధ్య వచ్చే ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదించారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. చారి పాత్రను మాత్రం ఇప్పటివరకు ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. అంతగా అందులో లీనమై నటించాడు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు.

అదుర్స్ సినిమాకు రచయితగా పనిచేసిన కోన వెంకట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికైనా మంచి పాయింట్ తో అదుర్స్ 2 ను తెరకెక్కిస్తామన్నారు. దీనికోసం తారక్ ను ఒప్పిస్తానన్నారు. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటిముందు ధర్నా చేసైనా ఒప్పిస్తానన్నారు. దేశంలో ఈ పాత్రను మరెవరూ చేయలేరన్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అదుర్స్ గొప్ప సినిమాగా నిలిచిపోయిందన్నారు. ఆ క్యారెక్టర్, మాడ్యులేషన్, ఆహార్యం.. అన్నీ తారక్ లా దేశంలో ఎవరూ చేయలేరని వెంకట్ వ్యాఖ్యానించారు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ట్రైలర్ విడుదల సమయంలో ఆయన దీనిపై మాట్లాడారు.

writer kona venkat latest comments on adurs sequel

అదుర్స్ సినిమాకు సీక్వెల్ చేయాలని దర్శకుడు వినాయక్ కూడా ప్రయత్నించారుకానీ జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపలేదు. ఆ సినిమా విడుదలైన ఒకటి, రెండు సంవత్సరాల తర్వాత కథను సిద్ధం చేసివుంటే చేయడానికి ఆసక్తి చూపించేవాడేమోకానీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయి.. రోజురోజుకు క్రేజ్ పెరుగుతున్న సమయంలో ఈ తరహా కథతో సినిమా చేయడం అంటే కష్టమేనని తారక్ అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దేవర తర్వాత వార్ 2 చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. దీనికి సంబంధించిన డేట్లు కూడా కేటాయించాడు. ఏప్రిల్ నెల నుంచే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+