పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్..
ఇటీవలి కాలంలో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాయి. రూ. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల కంటే తక్కువ బడ్జెట్ తో నిర్మించిన చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద జోరు ప్రదర్శిస్తున్నాయి. తెలుగులో ఇటీవలి కాలంలో చాలా చిన్న సినిమాలు బాక్సాఫిస్ వద్ద హిట్ టాక్ తో దూసుకెళ్లాయి. రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్, శంబాల, ఈషా లాంటి చిత్రాలు గతేడాది ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే ప్రస్తుతం ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అదే 'యూత్' మూవీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో యూత్ పేరుతో విడుదలైంది. ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటోందీ మూవీ. రిలీజైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 3.73 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీని ఈ2సీ బ్యానర్ పై నిర్మాతలు వినీత్, సందీప్ తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

స్టోరీ లైన్ కొత్తగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులను ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి జెన్ జీ కిడ్స్ ఎంజాయ్ చేసేలా మూవీలో వినోదం ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసే విధంగా ఎమోషన్స్ ఈ మూవీలో ఉన్నాయి. అలాగే సూరజ్, దేవదర్శిని చేతన్ వంటి అనుభవం కలిగిన నటీనటులు ఈ మూవీలో ఉన్నారు. అలాగే ఈ సినిమాలో అనిష్మ అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తమ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. యూత్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో లాంగ్ రన్ లో ఈ మూవీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications