స్టార్ వారసుడు విడాకులు..అక్రమ సంబంధం అంటూ భార్య పోస్ట్
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

తాజాగా కన్నడ స్టార్ ఫ్యామిలీ అయిన రాజ్ కుమర్ మనవడు , నటుడు యువరాజ్ కుమార్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. కన్నడ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ ఫ్యామిలీకి మంచి పేరుంది. ఆయనకు ముగ్గురు కొడుకులు. శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్. అయితే పునీత్ రాజ్ కుమార్ రెండేళ్ల క్రితమే గుండెపోటుతో మరణించారు. ఇక రెండో కుమారుడు అయిన రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకే ఈ యువరాజ్ కుమార్. తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టుకు ఎక్కాడు. 2019లో శ్రీదేవి అనే అమ్మాయిని యువరాజ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఇటీవల వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకోవాలని భావించారు. అయితే వీరిద్దరు కూడా ఒకరిపై మరొకరు అక్రమ సంబంధ ఆరోపణలు చేసుకున్నారు. తన భార్యకు మరొకరితో సంబంధం ఉందని యువరాజ్ కుమార్ ఆరోపించారు. ఓ నటితో యువరాజ్ కుమార్‌కు ఎఫైర్ ఉందని తన క్లైంట్ ఆరోపిస్తుందని ఆయన తరుఫు న్యాయవ్యాది తెలిపారు. దీనిపై స్పందించిన యువరాజు భార్య శ్రీదేవి తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని ఆమె తెలిపారు. నా భర్త ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నారని..కుటుంబ పరువు కోసం చాలా ఓపిక పట్టానని.. తప్పకుండా నిజం గెలుస్తుందని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications