'సీఎంకు కాంట్రాక్టు దక్కలేదనే, నక్సల్ సమస్య తెరపైకి'
హైదరాబాద్: ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ లైన్ కాంట్రాక్ట్ తమ బంధువుకు దక్కలేదనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నక్సల్ సమస్యను తెరపైకి తెచ్చారని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్ వచ్చిన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యుత్ లైను నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందం తెలంగాణ కేసీఆర్‌కు దక్కకపోవడం వల్లనే కరెంట్ లైన్ వేసే పనిని ఆపివేశారని ఆరోపించారు.

రిజర్వ్ ఫారెస్టులో విద్యుత్ లైన్ పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే బాగుంటుందన్న అధికారిని కేసీఆర్ ప్రభుత్వం బదిలీ చేసిందని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వ చేసిన హత్యలుగానే పరిగణించాలని వారు పేర్కొన్నారు.
ఐతే ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని మేలుకొలిపేందుకే బస్సు యాత్రను చేపట్టామని, రాజకీయం చేయడానికి ఎంతమాత్రం కాదని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించేలా కేంద్రంపై ఒత్తడి తేచ్చేందుకు ఈనెల 18,19,20 తేదీల్లో ఢిల్లీలో పర్యటించున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications