Fact Check:ఓవైసీ హిందూ ఆలయాన్ని సందర్శించారా..వాస్తవం ఏంటి..?

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియా వేదికగా ఎన్నో దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాను కొందరు కేటుగాళ్లు విరివిగా వినియోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వారి చేయనివి చేసినట్టుగా చేసినవి చేయనట్టుగా ఫోటోలు సృష్టిస్తూ వైరల్ చేస్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాదు సిట్టింగ్ ఎంపీ ఓవైసీకి ఎదురైంది.

మలక్‌పేట్‌లో ఎన్నికల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ పూజారి ఓవైసీకి పూలమాల వేసినట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ప్రచారంలో భాగంగా ఓవైసీ ఓ హిందూ ఆలయాన్ని కూడా సందర్శించారంటూ ఆ ఫోటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే ఇదంతా అవాస్తవమని లాజికలీ ఫ్యాక్ట్స్ చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో భాగంగా తేలింది.

Fact Check owaisi visiting temple

హైదరాబాదు లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఓవైసీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఓవైసీ నాలుగు సార్లు ఎంపీగా ఇదే స్థానం నుంచి గెలుపొందారు.ఈయనకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి మాధవీ లత బరిలో ఉన్నారు. ఇక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఓవైసీ గడప గడపకు వెళ్లి ఓటర్లను తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ప్రకారం మెడలో పూలమాలతో ధరించిన ఓవైసీ ఓ ఆలయ పూజారి పక్కనే నిల్చున్నట్లుగా ఉంది. బీజేపీ బలపడుతుండటంతో ఓవైసీపై ఒత్తిడి పెరిగి ఆలయాన్ని సందర్శించారంటూ ఓ ట్యాగ్‌ కూడా ఫోటో కింద రాసుకొచ్చాడు యూజర్.

అయితే ఓవైసీ ప్రచారంలో భాగంగా డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించిన మాట వాస్తవమే కానీ ఆలయాన్ని సందర్శించినట్లుగా ఎక్కడా లేదు. ఇదే విషయమై ఓవైసీ కార్యాలయం కూడా పూర్తి స్పష్టత ఇచ్చింది. మే 2వ తేదీన మలక్‌పేట్‌లోని సరస్వతి నగర్‌లో ప్రచారం సందర్భంగా తీసిన ఫోటో అని క్లారిటీ ఇచ్చింది.ఇక ఓవైసీ మెడలో పూలమాల వేసింది మాజీ కౌన్సిలర్ నివాసం వద్ద అని అది ఆలయంలో కాదని విచారణలో తేలింది.అంతేకాదు ఆ ప్రాంతంలోనే నివసించే ఓ పూజారి ఓవైసీని కలిసేందుకు మాత్రమే వచ్చారని తేలింది.దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓవైసీ ఫోటో అవాస్తవమని రుజువైంది.

ఇదంతా అవాస్తవ వార్తల నుంచి ప్రజలను అప్రమత్తం చేసే పనిలో శక్తి కలెక్టివ్ ఫ్యాక్ట్ చెక్‌ అనుబంధంగా పనిచేసే లాజికలీ ఫ్యాక్ట్స్ ఈ విచారణ చేసి ఓవైసీ హిందూ ఆలయాన్ని సందర్శించలేదని స్పష్టం చేసింది.

Fact Check

వాదన

అసదుద్దీనో ఓవైసీ ఆలయాన్ని సందర్శించారు.

వాస్తవం

ఓవైసీ ఆలయాన్ని సందర్శించలేదు. వైరల్ అవుతున్న ఫోటో ఎన్నికల ప్రచార సమయంలోనిది.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+