వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్య సమితిమానవ హక్కుల సంఘం సభ్యదేశాల ఎంపికఈమధ్యనే జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరందాదాపు 50 సంవత్సరాలపాటు ఈ సంఘంలోసభ్యత్వాన్ని కలిగివున్న అమెరికాకు ఈదఫా మొట్టమొదటిసారిగాసృంగభంగమైంది. సంఘ సభ్యత్వఎన్నికలో అమెరికా పరాజయం పాలయ్యింది. ఇక ఇప్పుడుఅహంకారధోరణితో, మానవ హక్కుల సంఘానికితాను బకాయిపడ్డ నిధులను ఇచ్చేది లేదంటూబెదిరిస్తూవుంది. ఈ మొత్తం ప్రహసనంఅమెరికా పాలకుల నిజస్వరూపానికి మచ్చుతునకగానిలుస్తుంది.

గత శతాబ్ధి ఆరంభంలోఅమెరికా అధ్యక్షునిగా ఉన్న ధియొడర్‌ రూజ్‌వెల్డ్‌ ఒకసందర్భంలో మెత్తగా మాట్లాడు, వినకపోతే కర్రవాడు అన్నాడు. ఈమాట అమెరికా పాలకులు ఇతర దేశాలతో (బహుశాస్వదేశంలో కూడా)అమెరికా వ్యవహరించే తీరుకునిదర్శనం. సాగినంతకాలం మెత్తటి మాటలు, నీతిబోధనలతో గడుపుకోవటం, సాగకుంటే కర్ర పెత్తనానికిపూనుకోవటం అమెరికా పాలకులకు ఆనవాయితీగానేవస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ప్రపంచపోలీసు పాత్ర వహించటం పరిపాటయ్యింది.చిలీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్నికూలదోయటం నుంచినేటివరకూ గడచిన 30-40సంవత్సరాల చరిత్రలో అమెరికా సాగించిన దౌత్యం అంతులేనిది. తన విధానాలను వ్యతిరేకించి,స్వతంత్రంగా వ్యవహరించిన దేశాలను నైతికంగా, నైతికతముసుగులో ఆర్ధిక ఆంక్షలను విధించటంద్వారావేధించేందుకు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘాన్నిఅమెరికా ఒక పనిముట్టుగా వాడకుంది. ఈనేపద్యంలోఅమెరికా నైతిక బోధనలను ఆలకించేందుకు ఐక్యరాజ్య సమితిలోని ఇతరదేశాలు విముఖత వ్యక్తం చేశారు. ఇతరపెట్టుబడిదారి దేశాలు సైతం అమెరికా అదుపునుంచిచేజారిపోతున్నాయని, అమెరికాను వ్యతిరేకించే స్ధాయికిఎదిగాయనీ ఇప్పటి పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. ఈనేపద్యంలో, మేకవన్నె పులిలా కొనసాగుతూవస్తున్న అమెరికా ఇకపై రంగువెలసిన,జవసత్వాలుడిగిన పులిగా ప్రపంచంముందు అపహాస్యం పాలు కానుంది.

తమకు నచ్చనిఅన్ని దేశాలనూ మానవహక్కుల ఉల్లంఘనపేరుతో వేలెత్తి చూపుతున్న అమెరికా పాలకులు తమదేశంలో ఏంచేస్తున్నారన్నది కూడా మనంగమనించాలి. ప్రపంచంలో అత్యంతధనవంతమైన దేశంగా చెప్పకోబడుతున్నఅమెరికాలో అభివృద్ధి చెందిన ఇతరపెట్టుబడిదారి దేశాలన్నటిలోకంటే ఎక్కువమంది పేదలున్నారు. ఈ పేదల సఖ్య చాలా కాలం క్రితమే 30మిలియన్‌లుగా అమెరికా ప్రభుత్వమేప్రకటించింది. అర్ధాకలితో పస్తులుండే ఈ ప్రజలకు కూడామానవహక్కులు ఉన్నాయనే విషయం అమెరికాప్రభుత్వానికి గుర్తుకు రాకపోవటం గురివింద గింజ సామెతలావుంది.ఇది చాలదన్నట్టు ఆదేశ ప్రస్తుత అధ్యక్షుడుబుష్‌ అమెరికాలోని సంక్షేమ రాజ్య వ్యవస్ధకు తూట్లుపొడిచేందుకు సర్వసన్నహాలూ చేస్తున్నారు.అమెరికా కార్మికుల పెన్షన్‌ నిధులు,వారి వైద్యసదుపాయాలకు ఇంత కాలం కల్పిస్తూవచ్చిన పలుసదుపాయాలకు మగళం పాడుతున్నారు. అలాగే, ప్రపంచంలోని పలుదేశాలలో తన బేజు సంస్దలు అయిన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ల ద్వారా ఇవే విధానాలను అమలు చేయించజూస్తున్నాడు.

ఇక, అమెరికాలో జైళ్లలోవున్న వారి సంఖ్యను వింటే మనకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోనిమరే ఇతర దేశంలోనూ లేని స్ధాయిలో అమెరికాజైళ్లలో ఖైదీలు వున్నారు. అమెరికా జైళ్లలో 2మిలియన్ల మంది ఖైదీలు వున్నారు. అంటే,అమెరికా పౌరులలోని ప్రతి 142 మందిలో ఒకరు జైలులోవున్నారన్నమాట! ఈ సంఖ్య దశాబ్ధం క్రితం ప్రతి 218మంది పౌరులకూ ఒక్కరిగా ఉండింది. అంటే, రానురానూ మొత్తంఅమెరికా సమాజమే పెద్ద జైలుగా మారిపోతున్నదన్నమాట!మరి, మానువహక్కుల గురించి గొంతుచించుకునే అమెరికా పాలకులకు తమ దేశంలో ఇంతమందినేరస్తులు ఉండటం ఎలా జీర్ణమవుతూవుందోమనకర్ధంకాదు.

మానవహక్కులలోవిద్యా సముపార్జనా హక్కును కూడా చేర్చి చూసినపుడు ఈవిషయంలో కూడా అమెరికా హీనస్ధితిలోనేఉన్నదని మనకు అర్ధమవుతుంది. ప్రస్తుత తరంవారు తమతల్లిదండ్రుల కంటే తక్కువుగా విద్యావకాశాలనుకలిగివున్నారని ప్రభుత్వం నియమించిన పలు పరిశీలనాసంఘాలే నిర్ధారించాయి.తుదకు పాఠశాల విద్యలో కూడా పలుఅవలక్షణాలు చోటుచేసుకుంటున్నాయి. పాఠశాలలవిద్యార్ధులు సైతం మత్తుమందులకు బానిసలవుతున్నారు.వివహంకాకముందే గర్భం ధరిస్తున్నారు.వీధులలో హిసా కాండకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.1960వదశకంతో పోల్చితే 1980వదశకంలో అమెరికా టీనేజర్లలో ఆత్మహత్యలు, హత్యల శాతం మూడురెట్లుపెరిగింది.

అమెరికా ఆర్ధికవ్యవస్ధలో బడుగువర్గంగా వున్నవారికి అమెరికా ఊహర స్వర్గం ఒక పీడకలగా మారింది.అమెరికా నగర ప్రాంతాలలోని చాలాచోట్ల సగం మందికిపైగాయువకులు నిరుద్యోగులుగా వున్నారు. నల్లజాతిపిల్లలలో సగంమందికి పైబడే పేదరికంలో మగ్గుతున్నారు.అలాగే, పుట్టే ముగ్గరు పిల్లలలోనూ ఇద్దరుఅవివాహిక తల్లులకు జన్మనిస్తున్నారు. నేడు ఒక సాధారణ నల్లజాతి బాలుడు పాఠశాలకువెళ్లేదానికంటే, జైలుకు వెళ్లేందుకే ఎక్కువఅవకాశాలువున్నాయి. వాస్తవానికి అమెరికాలోని పలు ప్రధాననగరాలలో సగంమందికి పైగా నల్లజాతి యువకులుజైళ్లలో ఉండటమో లేదా పెరోల్‌పైన లేదాప్రొబేషన్‌ పైన ఉండటమో జరుగుతూవుంది. హత్యకు గురయ్యిన పిల్లలనుస్మశానంలో పూడ్చి పెట్టేందుకు అయ్యే ఖర్చలకుగానుఇన్సూరెస్‌ పధకాలు రావటం నేటి అమెరికా పసిపిల్లలకు కూడా రక్షణలేకపోవటాన్నిసూచిస్తోంది. కాబట్టి, ప్రపంచంలోని ఇతరదేశాలకు (ముఖ్యంగా తనకు పొసగని) మానవహక్కులధర్మ సూత్రాలను వల్లించేముందుతమదేశంలోని పరిస్ధితిని బేరీజు చేసుకోవటంఅమెరికా పాలకులకు అవసరం. అందుకే కాబోలు ఇంటగెలిచి, రచ్చగెలవమని మన పెద్దలు అన్నారు.

అమెరికాకు మానవహక్కలువిషయంలో అటు అంతర్జాతీయంగాను, ఇటు స్వదేశంలోనూసరైన రికార్డులు లేవు. రెండవ ప్రపంచతుదిదశలో జపాన్‌పై ఆటంబాంబులు వేయటంమొదలుకునినేటివరకు అమెరికా అంతర్జాతీయ రాజకీయ చరిత్రంతారక్తసిక్తం. కాబట్టి, అమెరికా ఇప్పటికయినా చైనా, క్యూబావంటి దేశాలలో మానవహక్కుల ఉల్లంఘనజరుతున్నదంటూ ఆరోపించటాలు మానివేసి,సన్యసించటం ఉత్తమం. ఐక్యరాజ్య సమితిమానవహక్కుల సంఘంలోకి అమెరికా ఎన్నికకాలేకపోవటంఈరకమైన సూచనకు ప్రతిబింబం. అమెరికా కొత్త అధ్యక్షుడుబుష్‌ తలపెట్టిన జాతీయ క్షిపణి రక్షణవ్యవస్ధకు అమెరికా మిత్రదేశాలే సహకరించటంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే,చేసిన నిర్వాహంచాలు ఇక చేతులు ముడుచుకు కూర్చోమని పలుమిత్రదేశాలే అమెరికాకు సలహా ఇస్తున్నాయి.

[email protected]

ఆర్థిక, సామాజిక రంగాల అవినాభావ సంబంధాన్నివిశ్లేషించడంలో డి. పాపారావుది అందె వేసినచేయి. ప్రపంచ మార్గం ఎటు పోతుందనే జిజ్ఞాసఆయన వ్యాసాలకు ముడిసరుకు. పాపారావు పలు పత్రికలకువ్యాసాలు రాస్తుంటారు.

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X