• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బి. యస్‌. రాములు ప్రముఖ కథా రచయిత,సాహిత్య విమర్శకుడు. సామాజిక, తాత్వికవిషయాలపై విశేష కృషి చేస్తున్నారు.సమాజంలోని దళిత, బహుజన జీవితాలమెరుగుదలకు చేపట్టాల్సినకార్యాచరణపై ఆయన పలు పుస్తకాలువెలువరించారు. తెలుగు సమాజాన్నివిశ్లేషించే కార్యక్రమంలో, సాహిత్యాన్నిపునర్మూల్యాంకనం చేసే పనిలో ఆయననిమగ్నమై వున్నారు.

By Staff
|

మనమహారాజశ్రీ ప్రభుత్వంవారు విప్లవరచయితల సంఘాన్ని నిషేధించారు.సాహితీ సంఘాన్ని నిషేధించడం యిదేమొదటిసారి. గతంలో ఏ ప్రభుత్వమూచేయ సాహసించని పనిని యాప్రభుత్వంవారు చేశారు. శభాష్‌! దీనికిబహుశా పాలకులూ, వారికి రక్షణగా,వెన్నుదన్నుగా నిలిచి వున్న పోలీసువారూబహుదానందంతో మునిగి తేలుతూవుండి వుండవచ్చు. బ్రిటిష్‌వారివారసులు యింకా మన మధ్యేవున్నారనేందుకు యిదొక తాజావుదాహరణ.మొదటమావోయిస్టు పార్టీని నిషిద్ధ సంస్థగాప్రకటిస్తూ దానికి అనుబంధంగావున్నాయంటూ మరో ఏడు సంఘాలనునిషేధించారు. అందులో విరసం కూడా వుంది.అంతేగాక, విరసం సభ్యులుగా వున్నయిద్దరు శాంతిచర్చల ప్రతినిధులనుకూడా వెంటనే అరెస్టు చెయ్యడం జరిగింది.ఇదంతా శాంతికోసం ప్రభుత్వంవారుచేస్తున్న కృషి అనే అభినయం. లేక,ప్రజ్వరిల్లుతున్న అశాంతి సమస్యనిసక్రమంగా సహేతుకంగాపరిష్కరించలేని చాతగానితనం.మొట్టమొదటిసారివిరసాన్ని నిషేధించడంతో సాహిత్యచరిత్రలో మరో పుట తెరిచి, కొత్తఅధ్యాయంలోకి ప్రవేశించడంజరుగుతోంది. అక్కడ అనేకమౌలికాంశాలున్నాయి. వాటిపై ఆలోచనప్రసరింపకతప్పదు. అందులోముఖ్యమైంది కవులు, రచయితలస్థానం గురించి.రాజకీయ,యితర రంగాలలో వలెనేసాహితీరంగంలో కూడా అతివాదులు,మితవాదులు వున్నారు. అతివాద,మితవాదాలకు చెందని మూడో తరహావారు కూడా వున్నారు. వారి గురించి మరోసందర్భంలో మాట్లాడుకోవచ్చు.వర్తమానంలోనిజమైన ప్రజాకవులు, రచయితలువామపక్షంలో వుంటారు. కుహనావామపక్షంలో కాదు. నిజమైననిబద్ధమైన వామపక్షంలో వుంటారు.సామాన్య ప్రజల మనసులోనిబాధామయమైన వాక్కుని తమరచనల్లోంచి వినిపిస్తారు. సమాజంలోని,రాజ్యంలోని అసమానత, పాలకుల్లోని,యంత్రాంగంలోని క్రూరత్వం, అలసత్వఅమానవీయ లక్షణాల్ని ఎత్తి చూపుతారు.తప్పనిసరి అయినప్పుడు ప్రజలనుఉద్యమంగా తిరుగుబాటు చేయడానికిసంసిద్ధులను చేస్తారు. ఒక్కోసారి ఈ కవులు,రచయితలు ఆయా సాహితీ సంఘాల్లోసభ్యులుగా వుంటారు. ఇటువంటి ఆలోచనలుగల మరికొందరు ఆ సంఘాల వెలుపలవుండి రచనల ద్వారా తమ గొంతువినిపిస్తూ వుంటారు. వీరు ఆయుధాలుపట్టరు. తమ కలాలనే ఆయుధాలుగామలుచుకుంటారు. ప్రభుత్వం వీరిగొంతు నొక్కడం, అణచడం, సంఘాలనునిషేధించడం ప్రజాస్వామ్య యుగంలోఎంతవరకు సమంజసం?ఆమోదయోగ్యం? ప్రజల చేత ఎన్నుకోబడి,ప్రతినిధులుగా వొచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినవారు చేసే నాగరిక పనేనా?నిషేధమనేది నాటి ఎమర్జెన్సీకిపుట్టిన అష్టవంకరల బిడ్డ. గొంతునొక్కడం, అణచడం వంటి చేష్టలుకవుల, రచయితల మనసులోని భావాలభ్రూణహత్యకు పాల్పడడం.ప్రభుత్వం కలాన్ని ముట్టుకుంటేకాలుతుంది. వెంటనే నిషేధంఎత్తివేయడం అవసరం.శాంతిపేరుతో కుత్తుకలు తెగ్గేసుకోవడంనేను సహించను, సమర్థించను. కానిఅంతా శాంతి కిందనే జరుగుతోంది.దారుణ మారణ హత్యాకాండ ఎటు వైపునుండి జరిగినా - మావోయిస్టులు గాని,ప్రభుత్వం గాని, ఎవరివైపు నుండి జరిగినా- అది మనని స్మశానభూమికితీసుకువెడుతుందే తప్ప శాంతివెల్లివిరిసే నూత్న రాజ్య నిర్మాణం వైపుతీసుకెళ్లదు. రక్తసిక్త హస్త చర్యనాగరికం అనిపించుకోదు. ప్రభుత్వంగాని, ప్రభుత్వంలోని అమానుషాన్నివ్యతిరేకించేవారుగాని ఎవరుహత్యను సిద్ధాంతం చేసినా, ఒకహత్య మరో హత్యను పుట్టిస్తుందేతప్ప సమస్యకు పరిష్కారాన్నిప్రసవించదు.రెండువైపులా తీవ్రమైన లోపాలున్నాయి.రాజ్యాంగం సాక్షిగా, ధనికవర్గందొడ్డిదారిన, అవినీతి మార్గంలో, కులంమతం ప్రాంతం విభజనల విధానంతోఅధికారంలోకొచ్చి, తిరిగి సమాజాన్ని, రాజ్యాన్నీమరింత అవినీతిమయం చేస్తూ అలవిగానిపన్నులతో, ప్రజాధనం దోపిడీతో,అసమాన పాలనతో, సామాన్యుల్నిపీడించుకు తింటున్నది. తమ భౌతిక,ఆస్తుల భద్రతకు పోలీసునువుపయోగించుకుంటున్నది.ఇటువైపునప్రజల తరఫున నిలబడి ఆయుధంపట్టిన తీవ్రవాదులు వ్యక్తిగతహింసకు పాల్పడుతూ, రైలు బోగీలు, బస్సులదహనం, టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజీలలు, ఆఫీసుభవనాలు మొదలైన ప్రజల డబ్బుతోఏర్పడిన ఆస్తులను ధ్వంసంచెయ్యడం, తిరిగి వాటికోసం ప్రజలపైపన్నులభారం అధికం కావడం, ఆసౌకర్యాలు ఏళ్ల తరబడి కొనసాగడం,భయాందోళనలు ఉక్కిరిబిక్కిరి చెయ్యడంఎంతవరకు సమంజసం?రెండువైపులవారూ యా మార్గాన్నిఅనుసరించడం వల్ల తీవ్రవాదులు,ప్రభుత్వమూ, ప్రజలు అంతా పోలీసు చేతిలోకివెళ్లిపోయారు. ఫలితమేమిటి? పోలీసురాజ్యం ఏర్పడటం. మన సగటు పోలీసుకిమన దేశచరిత్ర గురించి, సమాజంగురించి తెలిసింది బహు తక్కువ. వాటిపైవారికి తగు శిక్షణ లేదు. అంతేకాదు,అతి ముఖ్యమైనది, మన పోలీసువ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిలేదు. ఇక సామాన్య జనం న్యాయంకోసం, క్రూరదోపిడీ వర్గం నుండిరక్షణ కోసం ఎవరి వైపు చూడాలి?ఇటువంటిసందర్భంలోనే ప్రభుత్వంలోని పాలకులుప్రజలు తమపై వుంచిన బాధ్యతలుగుర్తించాలి. స్వార్థం తగ్గించుకోవాలి. అవినీతితగ్గించడానికి కృషి చెయ్యాలి. పోలీసులపైపూర్తిగా ఆధారపడటం తగ్గించుకోవాలి.యువశక్తులు తీవ్రవాదంపైఆకర్షింపబడని విధంగా జీవనోపాధులుకల్పించాలి. అంటే - కష్టపడితే కడుపునిండే మార్గం చూపాలి. అవమానాలు,వలసలు, ఆత్మహత్యలు ప్రత్యామ్నాయాలుకాని పరిస్థితి తీసుకురావాలి.ఇక్కడనాదో సూచన వుంది. ఒక వైపుతీవ్రవాదులు ఆయుధం వదలడానికీ,ఎన్నికల్లో పాల్గొనడానికీ యిష్టపడడంలేదు. వాటిపై వాళ్ల ఆలోచన స్పష్టంగాచెప్పేశారు.మరోవైపుఎన్నికల్లో పాల్గొంటూ, పార్లమెంటరీప్రజాస్వామ్య విధానాన్నివుపయోగించుకుంటున్నవాళ్లు, దానినిదేశాభివృద్ధికి గాక తమ స్వార్థానికివుపయోగించుకుంటున్నారు. ప్రజాసేవకువుద్దేశించిన రాజకీయ రంగాన్నివ్యాపార రంగంగా మార్చేసి మొత్తంభ్రష్టు పట్టిస్తున్నారు. ఈసందర్భంగానే నా సూచన.పైనపేర్కొన్న రెండు శక్తులు కాక, పక్కమరో సంఘటనా శక్తి వుంది. అదేపౌరహక్కుల సంఘం, సంఘాలు. ఇవినిరంతరం ఉద్యమస్ఫూర్తితోపౌరహక్కుల కోసం అంకిత భావంతోపనిచేస్తున్నవి. అనేక వత్తిళ్ల మధ్యపనిచేస్తున్నవి. అయితే యా సంఘాలలోపనిచేసే వారిపై ఒక అపప్రథ వుంది. వీరుప్రధానంగా ప్రభుత్వానికివ్యతిరేకులని, కమ్యూనిస్టు లాయర్లని,అన్ని వేళలా తీవ్రాదుల కొమ్ముకాస్తూవుంటారని, తీవ్రవాదులకు హాని జరిగినప్పుడుమాత్రమే లేస్తారని, తీవ్రవాదహింసకు లోనైనవారిని గురించిపట్టించుకోరని, ఏమీ జరగనట్లు నిశ్శబ్దంపాటిస్తారని, మరీ తప్పకపోతేమంద్రస్వరంలో మాట్లాడడమే తప్పతీవ్రవాదులను తీవ్రంగా హెచ్చరించరని,వారిని దారిలోకి తీసుకువచ్చేందుకుప్రయత్నించరని - యిటువంటి భావాలుఉన్నాయి.ఏదిఏమైనా పౌర హక్కుల సంఘాల కృషితక్కువ చెయ్యవలసింది కాదు. వీటిలోమన సమాజ, రాజ్య గమనాన్నిపట్టించుకుంటున్న ఆలోచనాపరులు,క్షుణ్నంగా చదువుకున్నవారు, మరీముఖ్యంగా న్యాయవాదులు వున్నారు. వీరికిమన చట్టాల్లోని లోపాలు తెలుసు.యంత్రాంగం ఎందుకు ఎక్కడ తుప్పుపట్టిందీ తెలుసు. ధనికవర్గంవీటన్నింటినీ తమ స్వార్థ ప్రయోజనాలకువుపయోగించుకుని ఏ విధంగాశాసనభలకు, లోక్‌సభకుప్రజాప్రతినిధులుగా ఎలా వెడుతున్నదీతెలుసు. ప్రస్తుతం మన దేశం ఏప్రపంచ సంస్థల గుప్పిట్లో వున్నదోతెలుసు.కనక,పౌర హక్కుల సంఘాలు ఒక రాజకీయపార్టీగా ఏర్పడి, వీరే ఎన్నికల్లో నిలబడిప్రజాప్రతినిధులుగా శాసనసభలకు,పార్లమెంటుకు వెడితే బావుంటుంది. వీరిలోఎంత మంది ఎన్నికల్లో గెలుస్తారు,గెలవరు అని గాక వెంటనే ఆశించినఫలితాలు రాకపోయినా, ఎన్నికల ప్రచారసమయంలో తమ వుపన్యాసాల ద్వారామన చట్టాల్లోని లోపాలు, అవి ప్రజల ఆకాంక్షలుఎందుకని నెరవేర్చలేకపోతున్నాయి,ఎందుకని ఎవరి వల్లనిర్వీర్యమవుతున్నాయి, ఎవరు ఎలాతెలివిగా వాటిని వాడుకుంటున్నారు, అలాగేరాజ్యాంగంలోని పరిమితులు, ప్రభుత్వయంత్రాంగం ఎవరి వద్ద బందీగావున్నది మొదలైన విషయాలు ప్రజలకుతెలియజెప్పడానికి ఎంతో అవకాశంవుంది.ఇప్పుడుమన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి!ఒకరు అధికారంలో వుంటే మరొకరువిపక్షంలో వుంటున్నారు. ఇంక యిరవైనాలుగు గంటలూ ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం తప్ప మన దేశం అప్పులపాలు గాకుండా, తన కాళ్ల మీద తానునిలబడి అభివృద్ధి సాధించే కొత్తఆలోచనలేమీ ప్రజల ముందుకుతీసుకురాలేని జడ పార్టీలుగాకొనసాగుతున్నాయి.ఆనాడుస్వాతంత్య్ర సమరంలో న్యాయవాదులు,డాక్టర్లు, పత్రికాధిపతులు, ఉపాధ్యాయులు,వివిధ వృత్తులకు చెందినవాళ్లెందరో పాల్గొన్నారు.స్వాతంత్య్రమనే కలను నిజంచెయ్యగలిగారు.అలాగే,యివాళ పౌరహక్కుల కోసంపనిచేస్తున్నవారు, యింతకు ముందుచేసిన వారు కలిసి, ఒక వైపునబాధితులకు న్యాయసహాయం అందజేస్తూ,మరోవైపున మన సమాజ, రాజ్యాలపునర్నిర్మాణం దృష్టితో ఒక కొత్తరాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లోపాల్గొనవలసిందిగా కోరుతున్నాను.దీనివలన యువతరానికిఉద్యమస్ఫూర్తి వస్తుంది. నిజమైనఅభివృద్ధి కోరేవారు సమర్థిస్తారు. తిరిగికదలిక కలుగుతుంది. తద్వారాపార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంపటిష్టమవుతుంది. ఈ సూచనపైపౌరహక్కుల కొరకు కృషి చేస్తున్నవారంతా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X