వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: వన్.. ఫోర్.. త్రీ మ్యాజిక్ వర్డ్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తాను అంటూ అతను ఎడమ చెత్తో మెడ పట్టుకుని కుడిచేతి కత్తితో నరికేసిన తలని ఆమె చేతిలో పెడ్తాడు.

నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను నిన్నే అంటూ అతడు ఎడమ చేతితో గుండెను అదిమి పట్టి కుడి చేతి కత్తిని లోపలికి పోనిచ్చి లబ్ డబ్ అంటున్న బోర్లేసిన ఎర్రతామరను బయటకు తీసి ఆమె చేతిలో పెడ్తాడు.

Chinthapatla Sudarshan quick boxing on valentines day

‘పెడ్తాను అని అంటాడు'

ప్రపంచమంతా ఓ మూడు పదాల మూల మంత్రంతో తడిసి పోతున్నది. ఒక్కటీ.. నాలుగూ... మూడూ.

ఏం చేస్తుంటావు?

ప్రేమిస్తుంటాను.

అది కాదు ఏం చేస్తుంటావని

అదే ప్రేమించటమే చేస్తుంటాను. ప్రేమించటం తప్ప యింకేమి చెయ్యను. ప్రేమించటం తప్ప మరేమీ రాదు నాకు. ఒకటీ.. నాలుగు.. మూడు ఆమె చెవిలో వూదాడు. ఒకటీ.. నాలుగు.. మూడు. ఏదో మైకం కమ్మేసింది ఆమెని.

ఇందుగలడందు లేడని సందేహము వద్దు తండ్రీ అన్నాడొక కొడుకు, తండ్రిని చంపించటానికి పుట్టిన వాడు. నిజమే. ఎందెందు వెదకిచూచిన అందందే కలదు ప్రేమ కూడా. పబ్లిక్ గానూ వుంది ప్రైవేట్ గానూ వుంది. పని చేసే చోట వుంది పనిలేని చోటావుంది. చెవిలో మ్రోగే దాని డోల్బీ డిజిటల్ సౌండ్‌కి ఎవరూ తట్టుకోలేరు. మామూలు మంత్రం కాదు మూల మంత్రం అది. మాడర్న్ గాయత్రీ మంత్రం మరి.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడొకడు. వాడి పేరు షేక్స్‌పియర్. ఆ మాటేయింకా గ్లోబ్‌ని మాయా జగమనిత్యంని, సత్యం ఒక్కటే ఒక్కటని ప్రేమ మంత్రంతో కట్టి పడేస్తున్నది. ప్రేమ గుడ్డిది అని కూడా అన్నాడీ ఇంగ్లీషు విశ్వామిత్రుడు కొత్త మూల మంత్రం కనుకున్నవాడు ప్రేమ కోసం నిర్ధాక్షిణ్యంగా నిర్మొహమాటంగా ప్రేమికుల్ని చంపేసి శిక్షపడని హంతకుడు.

కాలవ గట్టున, నది ఒడ్డున, సముద్ర తీరంలో ప్రేమ టన్నుల కొద్దీ పండుతున్నది. ప్రేమ చెట్టుకి ప్రేమ కాయలు విరగ కాస్తున్నవి. ఇలా ప్రేమ సర్ ప్లస్ లెవల్లో మానుఫాక్చర్ అవుతున్నచోటికి వచ్చాడతగాడు. అందగాడే. ఒక కాలు వంకర ఓ కన్ను వంకర ఓ కనుబొమ్మా వంకర సరే నోరూ వంకరే అయితేనేం వెక్కిరించే నోరూ నుదురూ వుంటేనేం అందగాడే. ఈ అందగాడి పేరే ‘కలి పురుషుడు'

ఇక్కడికి వచ్చే ముందు....

కలి పురుషా, కల్తీ పురుషా ఎక్కడున్నావోయ్ అని పిలిచాడు బాస్.

అదేంటి బాస్.. ఎంత బాసువయితే మాత్రం కల్తీ పురుషా అని కేకేయ వద్దని చెప్పాను కదా బాస్.

మాటి మాటికీ బాస్ బాస్ అంటూ చిరాకు తెప్పించవద్దని నేనూ అన్నాను కదా! అది సరే డ్యూటీ మాటేమిటి?

బ్రహ్మాండం బద్దలౌతోంది బాస్. ఎలాగూ కల్తీ పురుషుడంటున్నారు కదా. లోకంలో పంచభూతాల్తో సహా అన్ని ఫిజికల్ గూడ్స్‌నీ కల్తీ చేసి పారేశాను. ఇక మానవ సంబంధాల విషయంలో ప్రోగ్రెస్ గ్రాఫ్‌లో రైజ్ చూస్తే నాకే దడ పుడుతున్నది. మనిషి మనిషికీ మధ్య లింక్ కట్‌చేసి పారేస్తున్నాను. తండ్రి కొడుకుని బండకేసి బాది చంపేస్తాడు. కొడుకు తండ్రిని నిద్దర్లో బండరాయితో చితకబాదుతాడు. బావని బామ్మర్ది, అల్లుణ్ణి మామ, అన్నను తమ్ముడు ఎప్పుడు పడితే అప్పుడు దేంతో పడితే దాంతో ‘పుటుక్కు జరజర డుబుక్కుమే' అనిపిస్తున్నారు.

ఎక్సలెంట్! అసలు మనలోకంలో లేని ఈ సంబందాల లింకు మనుషులకెందుకు? మనకుందా కుటుంబం? దేవలోకంలో వున్న మనం ఎవళ్లకి ఏమీ కాముకదా. మనకిలేని ఫ్యామిలీ సెంటిమెంటూ, ప్రేమా డ్రామా వీళ్లకి మాత్రం ఎందుకు కల్తీ పురుషా! అందుకే కోసి కారం పూస్తున్నా.. బాస్ టైముంది అంటూ హరీబరీగా వచ్చాడు కల్తీ పురుషుడు నదీ తీరంలోకి.

ఒకడు ప్రేమిక చెవిలో ఊదాడు మూడు పదాల మంత్రం. ఆమె చెంప మీద గుంటూరు ఎండు మిరపకాయ వేలాడింది. కల్తీ పురుషుడు ప్రియుడి తల్లోకి పురుగై ప్రవేశించాడు.

ప్రేమికులిద్దరూ నడుంచుట్టూ చేతులేసుకుని నది వైపు నడిచారు. సూర్యుడు బాణాలు పసుపు రంగు గుడ్డలో చుట్టుకుని కొంపకి బయల్దేరాడు. ప్రేమికుడు ఒక్కడే నది వైపు నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రేమిక రేపో మాపో నీటి మీద బట్టల మూటలా తేలుతుందేమో! ప్రేమికుడి తల్లో పురుగు మరో ప్రేమికుడి తలని వెదుక్కుంటూ వెళ్లింది.

ఒకప్పుడు ఉత్తరాల్లో కరెంటై ప్రవహించే ప్రేమ యిప్పుడు సెల్‌లో విచ్చలవిడిగా అచ్చోసిన ఆంబోతులా విహరిస్తున్నది ఈ దాగుడు మూతల ప్రేమకంటే డైరెక్టు అటాకే గుడ్ బెటర్ బెస్ట్ అని రోడ్డు మీద స్పీడ్ బ్రేకరవుతున్నది.

నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడతను. నేను ప్రేమించటం లేదు అంటుంది ఆమె. ప్రేమించవా? ఎందుకు ప్రేమించవు? ప్రేమించి తీరాలి అంటాడతను. ఐ హేట్ యూ అంటుందామె విసుగెత్తి. ఆమె ముఖం మీద ఆసిడ్ భగభగ భగ్గు. ప్రేమిస్తవా చస్తావా అంటాడతను. మించను అంటుందామె. ఊరిబయట లోన్లీ ప్లేస్ కాలిన బాడీ ఒకటి గుర్తుపట్టరాకుండా పడుంటుంది.

ఎందరు బలైపోయినా ప్రేమ దాహం తీరదు. ప్రేమను ప్రేమగా ప్రకటించే మూడు పదాల మంత్రానికి చింతకాయలు రాలి తీరాల్సిందే!!

- చింతపట్ల సుదర్శన్

English summary
An eminent columnist Chinthapatla Sudarshan's quick boxing column on valentine day special.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X