వాస్తు ప్రకారం అప్పుడప్పుడైనా తప్పకుండా వాడాల్సిన పూజా వస్తువులు

మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో దేవతలకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పించడం అత్యంత ప్రధానం. నిత్య పూజల్లో సాధ్యం కాకపోయినా, విశేష పర్వదినాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో వీటిని తప్పకుండా అర్పిస్తారు. ఇలా ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా దేవతలు ప్రసన్నమౌతారని, కోరిన కోరికలు తీర్చుతారని విశ్వసిస్తారు. జీవితంలో సుఖసంతోషాలు, అదృష్టం, దైవ ఆశీస్సులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పూజా సమయంలో ఇలా నైవేద్యంగా సమర్పించాల్సిన మూడు వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొబ్బరికాయ: దేవతలకు కొబ్బరికాయను సమర్పించడం వల్ల సంపద, కుటుంబ ఆనందం కలుగుతాయి. ముఖ్యంగా బుధ, శుక్రవారాల్లో గణపతికి, లక్ష్మీదేవికి లేత కొబ్బరి నీళ్ళు సమర్పించడం శ్రేష్ఠం. పూజానంతరం వీటిని ప్రసాదంగా పంచడం ద్వారా జీవితంలో సంతోషం, సమృద్ధి, ఐశ్వర్యం లభిస్తాయి. కొబ్బరి నీళ్ళు ఆలోచనలను శుద్ధి చేస్తూ, మానసిక స్పష్టత, ప్రశాంతతను పెంచుతాయి; అడ్డంకులను తొలగిస్తాయి. జాతకంలో చంద్రుని స్థానాన్ని కూడా ఇది బలోపేతం చేస్తుంది.

2. బెల్లం: తియ్యని బెల్లం శనిదేవుడికి, ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరం. శనివారం రోజున బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిది. ఇలా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా గత జన్మల పాపాలు, చెడు కర్మల ప్రభావం తొలగిపోతుంది. సుఖసంతోషాలతో జీవితం సాగుతుంది. పనుల్లో జాప్యం జరగదు. అందులో అడ్డంకులు ఉండవు. ఏ కార్యక్రమం తలపెట్టినా సజావుగా సాగుతుంది. రాహు గ్రహ ప్రభావాలు సైతం తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా తంత్ర ప్రభావాలతో బాధపడుతున్నవారు శనివారం నాడు శనీశ్వరుడికి, ఆంజనేయ స్వామికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పిస్తే ఉపశమనం పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.

3. నల్ల నువ్వులు: ప్రతికూల శక్తులు, చెడు ప్రభావాలను తొలగించడంలో నల్ల నువ్వులు అత్యంత ప్రభావవంతమైనవి.. శక్తిమంతమైనవి. అమావాస్య రోజున శివలింగానికి, శనిదేవుడికి నైవేద్యంగా వీటిని సమర్పించవచ్చు లేదా తిలాదానంగా ఇతరులకు ఇవ్వవచ్చు. నువ్వుల శక్తి చెడు కర్మల కల్మషాలను గ్రహించి, శుభప్రదమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. ఈ నైవేద్యాలు జాతకదోషాలను తొలగించి, జీవితంలో సానుకూల మార్పులను తెస్తాయి.

పైన పేర్కొన్న ఈ మూడు వస్తువులను దేవతలకు క్రమం తప్పకుండా నైవేద్యంగా సమర్పించడం ద్వారా పూజల పూర్తి ఫలాన్ని అందుకోవచ్చు. భవిష్యత్తు సమస్యల నుండి ఉపశమనం, జాతక దోషాల నుండి ముక్తి కోసం ఈ నైవేద్యాలు ఎంతో ముఖ్యమైనవిగా ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+